KBC Question: కేబీసీలో కేటీఆర్ ట్వీట్‌పై గంగూలీ, సెహ్వాగ్‌కు బిగ్‌బీ ప్ర‌శ్న..

కేటీఆర్ - అమితాబచ్చన్

దేశ‌వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన కార్య‌క్ర‌మం కేబీసీ(కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తీ). ఇందులో ఎందరో ప్ర‌ముఖులు పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మంలో సెహ్వాగ్‌, గంగూలీ పాల్గొన్నారు. త‌మ‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పారు. ఈ ప్ర‌శ్నల్లో అనూహ్యంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీటీర్ ట్వీట్‌పై ప్ర‌శ్న ఎదురైంది. అదేమిటంటే...

 • Share this:
  దేశ‌వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన కార్య‌క్ర‌మం కేబీసీ(కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తీ). ఇందులో ఎందరో ప్ర‌ముఖులు పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మంలో సెహ్వాగ్‌, గంగూలీ పాల్గొన్నారు. త‌మ‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పారు. ఈ ప్ర‌శ్నల్లో అనూహ్యంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీటీర్ ట్వీట్‌పై ప్ర‌శ్న ఎదురైంది. అదేమిటంటే...
  "citing a list of unpronounceable covid 19 medicines whom did telangana minister ktr tag in this tweet:
  "i suspect--- ji pakka has a role paly in this
  అనే ప్ర‌శ్న ఎదురైంది. కొద్ది నెల‌ల క్రితం కేటీఆర్- శశిథ‌రూర్ మ‌ధ్య ట్వీట్ట‌ర్‌లో జ‌రిగిన స‌ర‌దా సంభాష‌ణ హాట్ టాపిక్‌.. మ‌ళ్లీ కేబీసీ ద్వారా మ‌రోసారి ఆ సంభాష‌ణ వెలుగులోకి వ‌చ్చింది.  ఏంటా ట్వీట్‌..
  మే 20, 2021లో కరోనా వైద్యంలో భాగంగా వాడుతున్న మందులు, ట్యాబ్లెట్ల పేర్లను ట్వీట్‌లో ప్రస్తావించిన కేటీఆర్.. ఆ పేర్లు అలా ఎలా పలికేందుకు చాలా కఠినంగా పెట్టారో ఎవరికైనా తెలుసా? అని ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే.. మరో ట్వీట్ చేస్తూ తాను అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పక్కాగా పాల్గొనాలని ఆయన్ను ట్యాగ్ చేశారు. దీంతో శశిథరూర్ దీనిపై మే 21, 2021 ట్వీట్ చేశారు. ఆంగ్లంలో ఎంతో ప్రావీణ్యం ఉన్న‌ శశి థరూర్‌ను కేటీఆర్‌ సమాధానం చెప్పాలని కోరగా.. ఆయన ఆ ట్వీట్‌పై స్పందించారు.  నిజంగానే ఆయన చేసిన ట్వీట్‌ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎంపీ శశి థరూర్ ఏకంగా 29 అక్షరాలతో ఓ పదం వాడారు. మందులకు ఆ పేర్లు ఎలా పెడతారనే దానిపై కాస్త వెటకారంగా స్పందిస్తూ.. CoroNil (కరోనిల్), CoroZero (కరోజీరో), ఆఖరికి GoCoroNaGo! (గో కరోనా గో) వంటి పేర్లు పెడతానని సరదాగా ట్వీటారు.
  దీనిపై శుక్రవారం మధ్యాహ్నం స్పందించిన కేటీఆర్ ‘‘దేవుడా.. ఓ డిక్షనరీని బయటకు తీయవలసి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. శశిథరూర్ సూచించిన పేర్లలో CoroNil అనే పేరు బాగుందని కేటీఆర్ మెచ్చుకున్నారు.
  ఇప్పుడు ఈ ప్ర‌శ్న కేబీసీలో ప్ర‌త్య‌క్షం అవ్వ‌డంతో అంద‌రూ అప్ప‌టి స‌ర‌దా సంభాష‌ణ‌ను గుర్తు చేసుకొన్నారు.
  Published by:Sharath Chandra
  First published: