హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah Munugodu Tour: నేడు మునుగోడుకు అమిత్ షా.. షెడ్యూల్‌లో మార్పు.. సీఎం కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇస్తారా?

Amit Shah Munugodu Tour: నేడు మునుగోడుకు అమిత్ షా.. షెడ్యూల్‌లో మార్పు.. సీఎం కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇస్తారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BJP Munugodu Meeting: సీఎం కేసీఆర్‌కు మునుగోడు సభ వేదికగా అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలు అంతా సిద్ధం చేశారు. మునుగోడుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఎంత ఖర్చు పెట్టింది? అనే దానిపై ఇప్పటికే ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించారు. వాటిని లెక్కలతో సహా సభా వేదికగా వివరించే అవకాశముంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉపఎన్నికలు (Munugode Bypoll) తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సెగలు రేపుతున్నాయి. ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. నోటిఫికేషన్ రాలేదు. ఐనా అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (Komatireddy Rajagopal Reddy) రాజీనామా చేసిన తర్వాత.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓ బహిరంగ సభను నిర్వహించింది. ఆ తర్వాత శనివారం టీఆర్ఎస్ సభ జరిగింది. ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్ (CM KCR) హాజరై.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆ మరుసటి రోజే.. అంటే ఇవాళ అదే మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరుగుతుంది. హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్య అతిథిగా హాజరవుతారు.ఈ సభ వేదికగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.

  CM KCR | Munugodu By elections: ‘‘ సమాధానం చెప్పు బిడ్డ అమిత్​ షా.. మాకు ఆ నీళ్లెందుకు ఇవ్వడం లేదు.. ’’: సీఎం కేసీఆర్

  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఈ సభకు మనుగోడు సమరభేరిగా నామకరణం చేశారు. శనివారం టీఆర్ఎస్ సభకు భారీగా జనం తరలి రావడంతో.. అంత కంటే ఎక్కువే జన సమీకరణ చేసి.. తమ బలం చాటాలని బీజేపీ నేతలు వ్యూహం రచించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. ఒక్క మునుగోడు నియోజకవర్గం నుంచే 50వేల మంది సభకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించింది.

  Munugodu: మునుగోడు సభలో రైతులకు సీఎం కేసీఆర్​ శుభవార్త.. పూర్తి వివరాలివే

  ప్రజా దీవెన సభలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని.. వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెడతారని చెప్పారు. నిధులు ఇవ్వకుండా, నదీ జలాల్లో వాటా తేల్చకుండా, రైతుల ధాన్యం ఇవ్వకుండా.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు మునుగోడు సభ వేదికగా అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలు అంతా సిద్ధం చేశారు. మునుగోడుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఎంత ఖర్చు పెట్టింది? అనే దానిపై ఇప్పటికే ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించారు. వాటిని లెక్కలతో సహా సభా వేదికగా వివరించే అవకాశముంది. అటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందన్న దానిపైనా అమిత్ షా స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.

  అమిత్ షా పర్యటన షెడ్యూల్:

  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తున్న అమిత్ షా.. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

  2.10 గంటలకు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.

  2.40గంటలకు సికింద్రాబాద్‌లోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణను కలుసుకొని అరగంట పాటు గడుపుతారు

  3.20 గంటలకు బేగంపేటలోని రమదా మనోహర్ హోటల్‌కు చేరుకుంటారు.

  4 గంటలకు అదే హోటల్‌లో రైతు సంఘాల నేతలతో హోంమంత్రి అమిత్ షా సమావేశమవుతారు.

  4.10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు చేరుకుంటారు.

  సాయంత్రం 4.40 నుంచి 04.55 గంటల వరకు మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం

  5 గంటలకు మునుగోడులో జరిగే బహిరంగసభలో అమిత్ షా పాల్గొంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు.

  సభ ముగిసిన తర్వాత శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు అమిత్ షా చేరుకుంటారు.

  రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై మనుగోడులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు.

  అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు అమిత్ షా.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Munugode Bypoll, Munugodu By Election, Telangana Politics

  ఉత్తమ కథలు