AMIT SHAH HYDERABAD TOUR HOME MINISTER TO PARTICIPATE IN TUKKUGUDA BJP PUBLIC MEETING HERE IS COMPLETE SCHEDULE SK
Amit Shah Tour: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా.. తుక్కుగూడలో బహిరంగ సభ.. బీజేపీలో భారీగా చేరికలు
అమిత్ షా (ఫైల్)
Amit Shah Telangana Tour: సాయంత్రం నోవాటెల్ హోటల్లో ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. అనంతరం వాటిపైనే సభలో ప్రసంగిస్తారు.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటి నుంచే సందడి మొదలయింది. నేతల పాదయాత్రలు, జాతీయ నేతలతో పర్యటనలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో పర్యటించగా.. తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా (Amit shah Hyderabad Tour) ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ (BJP Tukkuguda Meeting)లో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని... టీఆర్ఎస్పై యుద్ధం ప్రకటిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇటీవలే వరంగల్‌లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకు మించి జనసమీకరణ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
సాయంత్రం నోవాటెల్ హోటల్లో ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. అనంతరం వాటిపైనే సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ని వేగవంతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇవాళ్టినుంచి దానిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటన సందర్భంగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
కాగా, తెలంగాణ బీజపీ అధ్యక్షుడు సంజయ్ (Bandi sanjay) ఏప్రిల్ 14న తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) ను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాఫీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ విమర్శిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పాదయాత్ర నేటితో మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సందర్భంగానే బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.