హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah| Hyderabad : అమిత్ షా ఆగమనం.. అడుగుపెడుతూనే అనూహ్యం.. వ్యూహం మారిందా?

Amit Shah| Hyderabad : అమిత్ షా ఆగమనం.. అడుగుపెడుతూనే అనూహ్యం.. వ్యూహం మారిందా?

బేగంపేట ఎయిర్ పోర్టులో షాకు స్వాగతం

బేగంపేట ఎయిర్ పోర్టులో షాకు స్వాగతం

బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన మొదలైంది. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం 2.45కు అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. హిందీవాదిగా విమర్శలు ఎదుర్కొంటున్న షా తెలుగులో ట్వీట్ చేశారు. సాయంత్రం తుక్కుగూడ సభలో ప్రసంగిస్తారు. వివరాలివే..

ఇంకా చదవండి ...

తెలంగాణలో నెలకొన్న ముందస్తు ఎన్నికల వేడిని మరింత రాజేస్తూ బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన (Amit Shah Hyderaba Visit)  మొదలైంది. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం 2.45కు అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన బేగంపేట విమానాశ్రయంలో ల్యాండయ్యారు. అక్కడి నుంచి షా నేరుగా రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (NCFL)వెళ్లారు. నూతనంగా నిర్మించిన ల్యాబ్ ప్రారంభోత్సవం అమిత్ షా షెడ్యూల్ లోని ఏకైక ప్రభుత్వ పరమైన అంశం. ల్యాబ్ ఓపెనింగ్ తర్వాత ఆయన కార్యక్రమాలన్నీ రాజకీయపరమైనవే కావడం గమనార్హం.

హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సహచర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ నేత డీకే అరుణ తదితరులు స్వాగతం పలికారు. ప్రోటోకాల్ ప్రకారం హైదరాబాద్ డీసీసీ దీప్తి చందన, ఇతర అధికారులు షాకు సెల్యూట్ చేశారు. కిషన్ రెడ్డితోపాటు ఇంకొందరు బీజేపీ నేతలూ అమిత్ షాకు పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. కాగా,

బేగంపేట ఎయిర్ పోర్టులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణ పోలీస్ అధికారుల సెల్యూల్

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు పొందే లబ్దిదారుల జాబితా విడుదల


హైదరాబాద్ లో కాలు మోపడానికి కొద్ది నిమిషాల ముందు అమిత్ షా తన పర్యటన వివరాలను తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. దేశంలో హిందీని తప్పనిసరి చేస్తామంటూ వరుస ప్రకటనలు చేసి, కరడుగట్టిన హిందీవాదిగా ముద్రపడిన అమిత్ షా గడిచిన కొద్ది నెలలుగా హిందీయేతర రాష్ట్రాల నేతల నుంచి విమర్శలూ ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్-మిగతా భాషల సినిమాల స్టార్ల మద్య వివాదాలకు ఆజ్యంపోసింది కూడా షా ప్రకటనలేననే ఆరోపణలున్నాయి. తన హిందీ వాదనపై ఇప్పటిదాకా వెనక్కి తగ్గని అమిత్ షా ఇటీవల కాలంలో తొలిసారి తెలుగులో ట్వీట్ చేయడం అనూహ్యంగా మారింది.

అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న కిషన్ రెడ్డి, డీకే అరుణ

Wheat: పెట్రోల్‌కు పోటీగా గోధుమపిండి ధర.. కేంద్రం సంచలన నిర్ణయం.. గోధుమల ఎగుమతిపై నిషేధం


‘‘హైదరాబాద్‌లోని CFSL క్యాంపస్‌లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించేందుకు నేడు తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నాను..’’ అంటూ అమిత్ షా తెలుగులో ట్వట్ చేశారు. తెలంగాణలో అడుగుపెడుతూనే తెలుగులో ట్వీట్ చేయడం ద్వారా హిందీవాదన విషయంలో వ్యూహం మార్చుకున్నట్లు షా సంకేతాలిచ్చినట్లయింది.

అమిత్ షాతో కిషన్ రెడ్డి

Plants in Moon Soil: చంద్రుడి మీది మట్టిలో మొక్కలు.. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం.. ఇక వ్యవసాయం


అంబర్ పేటలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, ఇతర కార్యక్రమాలు గంటపాటు సాగుతాయి. ఆ తర్వాత అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 సమయంలో తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు వెళతారు. కీలక ప్రసంగం తర్వాత రాత్రి 8.20కు కేంద్ర హోం మంత్రి తిరిగి ఢిల్లీ బయలుదేరతారు.

CM KCR ఫలితం కాచుకో: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ -అర్థమేంటి? Z-కేటగిరీ : బీజేపీ-ప్రజాశాంతి పొత్తు?


తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న దరిమిలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టడం, ఆ పాదయాత్ర రెండో విడత ముగింపు సందర్బంగా ఇవాళ తుక్కుగూడ (మహేశ్వరం)లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అందులో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకే అమిత్ షా హైదరాబాద్ రావడం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి రాక సందర్భంగా హైదరాబాద్ లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ ఎన్నికల విజన్ ను షా వెల్లడించే అవకాశముంది.

First published:

Tags: Amit Shah, Bjp, Hyderabad, Kishan Reddy, Telangana

ఉత్తమ కథలు