Home /News /telangana /

AMID TUSSLE WITH TRS CM KCR AND COMPLAINT TO PM MODI TELANGANA GOVERNOR TAMILISAI MADE SENSATIONAL COMMENTS MKS

CM KCR స్వయంగా రావాల్సిందే -నాపై రాళ్లు వేస్తే రక్తంతో చరిత్ర రాస్తా: Governor Tamilisai

సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

గవర్నర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సాగుతోన్న వివాదం మరింత ముదిరిందా? అన్నట్లు తమిళిసై మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్కారును ఢీకొట్టే విషయంలో ప్రధాని మోదీ, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? వివరాలివే..

ఇంకా చదవండి ...
తెలంగాణలో గవర్నర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సాగుతోన్న వివాదం మరింత ముదిరిందా? అన్నట్లు తమిళిసై (Telangana Governor Tamilisai) మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్కారును ఢీకొట్టే విషయంలో ప్రధాని మోదీ, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? రాజ్ భవన్ కేంద్రంగా అనూహ్య రాజకీయాలు జరుగుతున్నాయా? ప్రోటోకాల్ వివాదం ఎందుకు తలెత్తింది? అసలు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తో గవర్నర్ విభేదాలు సమసిపోయేందుకు దారే లేదా? ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్ అన్నారన్న టీఆర్ఎస్ ఆరోపణలో నిజమెంత? తదితర కీలక ప్రశ్నలకు గవర్నర్ తమిళిసై స్వయంగా సమాధానాలిచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో ఈ మేరకు తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వతహాగా తాను సౌమ్యురాలినని, బీజేపీ నేపథ్యం ఉన్నప్పటికీ రాజ్యాంగబద్ధ పదవిలో పార్టీలకు అతీతంగానే వ్యవహరిస్తున్నానని, రాజ్ భవన్ బీజేపీ ఆఫీసుగా మారిందన్న టీఆర్ఎస్ ఆరోపణల్లో అర్థమేలేదని గవర్నర్ తమిళిసై చెప్పారు. తన పుట్టినరోజైన జూన్ 2నాడే తెలంగాణ కూడా ఆవిర్భవించిందని, ఇక్కడి ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని, సీఎంతో విభేదాల కారణంగా రాష్ట్రం విడిచి పోవాలనే ఆలోచనేదీ లేదని ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సర్కారుతో ఢీ అంటే ఢీ అనాలంటూ కేంద్రం పెద్దలు నిర్దేశం చేయలేదని, అయితే పని ద్వారానే బదులివ్వాలని ప్రధాని సూచించారని తమిళిసై వెల్లడించారు. పలు అంశాలవారీగా గవర్నర్ ఏం చెప్పారో ఆమె మాటల్లోనే..

PM Kisan | Rythu Bharosa : రైతులకు శుభవార్త.. ఈరోజే బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5500 జమ.. నెలాఖరున మరో రూ.2000..


‘‘నాకై నేనుగా సీఎంతోగానీ, ప్రభుత్వంతోగానీ గొడవలు విభేదాలు సృష్టించలేదు. ప్రభుత్వం నాకు కనీసం ప్రోటోకాల్ ప్రకారమైనా గౌరవం ఇవ్వడంలేదన్నది వాస్తవం. అయితే అందుకు నాకేమీ బాధలేదు. ఒక మహిళా గవర్నర్ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చరిత్రలో మచ్చగా మిగిలిపోతుంది. గతంలో ఏవైనా ఇష్యూస్ ఉంటే సీఎంతో నేరుగా మాట్లాడేదాన్ని. కానీ ఆయన నన్ను కలవక ఏడాది కావొస్తోంది. ఈ మధ్య ఫోన్లు చేసినా లైన్ లోకి రావడంలేదు. అపోహల తొలగిపోవాలంటే కేసీఆర్‌ స్వయంగా వచ్చి కూర్చొని నాతో మాట్లాడాల్సి ఉంటుంది. నేను రాజ్యాంగబద్ధమైన ఒక ఉన్నత పదవిలో ఉన్నాను. మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలోని అంశాలను సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడం విచిత్రంగా అనిపించింది.

CM KCR | Prashant Kishor : మరోసారి కేసీఆర్‌తో పీకే భేటీ.. బీజేపీకి దిమ్మతిరిగే వ్యూహం ఇదేనా?


అధికార పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు నాపై బహిరంగంగా ఇష్టానుసార వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా చేశారు. ఈవిషయాన్ని తెలంగాణ ప్రజలకే వదిలేస్తున్నా. ఒక మహిళతో ఇలా వ్యవహరించవచ్చా ? ఇదేనా తెలంగాణ సంస్కృతి ? నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్‌ను.. బద్ధ శత్రువు వచ్చినా గౌరవంగా వ్యవహరించే సంస్కారం నాది. ప్రభుత్వం కూలిపోతుందనే మాట నేను అననేలేదు. శాసన మండలి, శాసన సభను ప్రొరోగ్‌ చేస్తూ గతేడాది ఓసారి ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో రాజ్యాంగం ప్రకారం.. ఆరునెలల్లోగా తిరిగి ఉభయ సభలు సమావేశం కావాల్సి ఉంటుందని, లేకుంటే సాంకేతిక సమస్య తలెత్తవచ్చని మాత్రమే పేర్కొన్నాను.

Business Idea: తక్కువ పెట్టుబడితో అద్భుత వ్యాపారం.. నెలనెలా భారీ సంపాదన ఖాయం


కేసీఆర్ సర్కారు తీరుపై నేను కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదో రిపోర్టు మాత్రం ఇచ్చాను. అందులో అన్ని అంశాలు ఉన్నాయి. కేసీఆర్ తో ఫైట్‌ బ్యాక్‌ చేయాలని ప్రధాని అన్నట్లు వార్తల్లో వచ్చింది నిజం కాదు. వర్క్‌ బ్యాక్‌ అని మాత్రమే మోదీ నాతో అన్నారు. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా పని చేస్తూ ముందుకు సాగండి అని మాత్రమే ప్రధాని సూచించారు. అయినా సీఎం కేసీఆర్‌ గౌరవించేది వ్యక్తిగతంగా నన్ను కాదు. కేవలం గవర్నర్‌ హోదాను.. రాజ్‌భవన్‌ను!!

Shameful : పుట్టినరోజు పేరుతో 12ఏళ్ల పాపకు పెళ్లి చేశారు.. రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన


నేను ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం మనిషినే. ప్రధానమంత్రి అభిమానినే. ఈ విషయాన్ని ఎక్కడా దాచుకోలేదు. అయితే నేను సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానే తప్ప.. విధ్వంసకరంగా కానే కాదు. గవర్నర్‌ స్థానాన్ని అవమానిస్తే మాత్రం సహించను. తమిళిసైగా నన్ను అవమానించవచ్చు. వ్యక్తిగతంగా నాపై రాళ్లు కూడా రువ్వొచ్చు. ఒకవేళ రాళ్లు రువ్వి, రక్తం చిందితే.. ఆ రక్తంలో పెన్నును తడిపి చరిత్రను రాస్తాను. గవర్నర్‌కు ప్రొటోకాల్‌ విషయంలో తెలంగాణ గాడి తప్పింది. నా వ్యక్తిగత కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ఉండాలని నేను కోరుకోను. స్నేహ హస్తం ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. తెలంగాణ ప్రజల కోసం నేను అందరితో కలిసి నడవడానికి సిద్ధం..’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. గవర్నర్ తాజా వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Governor Tamilisai, Governor Tamilisai Soundararajan, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు