Home /News /telangana /

AMID INTERNATIONAL DEMAND TELANGANA COTTON PRICE AT RECORD PRICE OF RS 9K PER QUINTAL AT KHAMMAM MARKET YARD MKS

Cotton : తెల్లబంగారానికి అదిరిపోయే ధర.. పత్తి క్వింటాల్‌ రూ.9 వేలు.. వరి వద్దన్నందుకు భలే గిరాకీ..

తెలంగాణలో పత్తికి రికార్డు ధర

తెలంగాణలో పత్తికి రికార్డు ధర

సీజన్ ప్రారంభంలోనే తెల్లబంగారానికి అదిరిపోయే ధరలు రావడం పాజిటివ్ సంకేతాలు ఇచ్చినట్లయింది. అదీగాక అంతర్జాతీయ మార్కెట్లలోనూ పత్తికి డిమాండ్ పెరగడం తెలంగాణ రైతులకు కలిసొచ్చినట్లుగా ఉంది. మంగళవారం నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో పత్తి రికార్డు ధరకు అమ్ముడుపోయింది..

ఇంకా చదవండి ...
తెలంగాణ పంటల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలు మరోసారి నిజం అయ్యాయా? కేంద్రంతో కేసీఆర్ వరి పోరు తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు తెలంగాణకు అనుకూలం కాబోతున్నాయా? అంటే ప్రస్తుతానికి అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే తెల్లబంగారానికి అదిరిపోయే ధరలు రావడం పాజిటివ్ సంకేతాలు ఇచ్చినట్లయింది. అదీగాక అంతర్జాతీయ మార్కెట్లలోనూ పత్తికి డిమాండ్ పెరగడం తెలంగాణ రైతులకు కలిసొచ్చినట్లుగా ఉంది. మంగళవారం నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో పత్తి రికార్డు ధరకు అమ్ముడుపోయింది..

తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరగ డం, ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో వ్యాపారులు పోటీపడటంతో రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో మంగళవారం పత్తికి రికార్డుస్థాయి ధరలు నమోదయ్యాయి. ఖమ్మం మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తికి గరిష్ఠ ధర రూ.9 వేలు పలికింది.

basti dawakhana : ఇక రాష్ట్రమంతా బస్తీ దవాఖానలు.. 141 మున్సిపాలిటీల్లో కొత్తగా 288.. జూన్2లోపే ఓపెనింగ్



పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తికి గరిష్ఠంగా రూ.8,833 ధర వచ్చింది. ఈ మార్కెట్‌ చరిత్రలోనే పత్తికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజు పృథ్వీరాజ్‌ తెలిపారు. గజ్వేల్‌లో క్వింటాల్‌ రూ. 8,819 ధర పలికిందని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ మహిపాల్‌ తెలిపారు. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో సీజన్‌లో తొలిసారి రికార్డు స్థాయి లో క్వింటాల్‌కు రూ.8,715 పలికింది.

Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్



ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తెలంగాణలో వరి పండిచొద్దని, రైతులంతా పత్తి, పప్పు ధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కేసీఆర్ సర్కారు గత కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. పత్తికి రికార్డు స్థాయిలో లభించిన ధర మరి కొద్ది నెలలు కొనసాగే అవకాశాలు లేకపోలేవని మర్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Paddy, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు