Home /News /telangana /

AMID COVID SURGE TELANGANA HEALTH DIRECTOR SRINIVAS CLARIFIES ON IMPOSING NIGHT CURFEW MKS

Night Curfew: తెలంగాణలో covid వ్యాప్తి.. రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ క్లారిటీ..

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ డా.శ్రీనివాస్

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ డా.శ్రీనివాస్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే లాక్ డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధింపునకు మాత్రం ప్రభుత్వం సుముఖంగా లేదు..

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాపించకుండా కట్టడి చర్యలు చేపట్టిన ప్రభుత్వం లాక్ డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధింపునకు మాత్రం సుముఖంగా లేదు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఆయన మంగళవారం కీలక వివరణలు ఇచ్చారు.

కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని, తెలంగాణలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఒక్క జిల్లాలోనూ ఆ రేటు 10శాతం మించలేదని డీహెచ్‌ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది.

BJP ఎమ్మెల్యే కొడుకు సహా 7 మెడిసిన్ విద్యార్థులు దుర్మరణం.. PM Modi పరిహారం: Maharashtra Accident


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కొవిడ్ పాజిటివిటీ రేటు 4.26శాతంగా ఉందని, మేడ్చల్‌లో 4.22శాతం.. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 6.45శాతం, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఎక్కడా ప్రమాదకర పరిస్థితులు లేవు కాబట్టి నైట్ కర్ఫ్యూ అవసరం ఉండదన్నారు డాక్టర్ శ్రీనివాస్.

Rajasthan: అందమైన కోడల్ని కోరి తెచ్చుకుంది.. కానీ అనూహ్య ఘటన తర్వాత ఆ అత్త తీసుకున్న నిర్ణయమిది..



ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 61శాతంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. వారం రోజులుగా లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని, 18ఏళ్లలోపు వారిలో 59శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని, రాష్ట్రంలో 2.16లక్షల మందకి ప్రికాషన్‌ డోసు ఇచ్చామని డీహెచ్‌ నివేదికలో పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, Night curfew, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు