Black fungus Injections : నేరుగా ఆసుపత్రులకే Amphotericin-B బాధితులకు తప్పిన టెన్షన్

రోగుల పేరుతో నేరుగా ఆసుపత్రులకే Amhotericin-B

Black fungus Injections : రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ దందాతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది..బ్లాక్ ఫంగస్‌ చికిత్స కోసం ఉపయోగించే యాంఫోటెరిసిన్ ఇంజక్షన్ల పంపిణిలో అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టింది..ఇంజక్షన్లను చికిత్స పొందుతున్న వారి పేరు మీదుగా నేరుగా ఆయా ఆసుపత్రులకే కేటాయిస్తోంది.

  • Share this:
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్‌ దందా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది... కరోనా రోగులకు రెమ్‌డెసివర్ అంత్యంత అవసరమైన నేపథ్యంలోనే ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ తరలించి లక్షల రూపాయలను దోపిడి చేశారు..పోలీసుల కళ్లుగప్పి ప్రజల అవసరాలను ఆసరా చేసుకున్న కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు దోపిడి తెరలేపాయి..నాలుగు వేలు ఉండే ఇంజక్షన్ ధరను ఏకంగా నలబై నుండి యాబై వేల మధ్య అమ్మిని సంఘటనలు వెలుగు చూశాయి. దీంతో బ్లాక్ దందాను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు చేపట్టిని దోపిడి మాత్రం ఆగలేదు..

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ చికిత్సలో ప్రధానంగా మారిన ఇంజక్షన్ల విషయంలో అలర్ట్ అయింది. మధ్యదళారీల నుండి ప్రజలను కాపాడేందుకు మొదటి నుండే ప్రణాళికలను రూపోందించింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇచ్చే యాంఫోటెరిసిన్ బీ ఇంజక్షన్లను దళారీ వ్యవస్థకు చేరకుండా నేరుగా ఆసుపత్రులకు ఇచ్చే ఏర్పాట్లను చేస్తోంది. కేంద్రం నుండి నేరుగా స్టాకిస్టులకు వస్తున్న ఇంజక్షన్లను తమ పరిధిలోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఇంజక్షన్ల పంపిణి చేసేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటి ఇప్పటికే నియమించింది. ఈ కమిటి ద్వార ఇంజక్షన్ల పంపిణి ప్రక్రియను సమన్వయం చేస్తోంది..ముఖ్యంగా ఇంజక్షన్లు కావాల్సిన వారు ప్రభుత్వం ఇచ్చిన మెయిల్ అడ్రస్‌కు పేషంట్ వివరాలతో పాటు ఆసుపత్రులు ఇచ్చిన రిఫరెన్స్ లెటర్స్‌తో ధరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకువచ్చి వారికే నేరుగా ఇంజక్షన్లను అందిస్తోంది..స్టాక్‌, మరియు రోగి అవసరాన్ని బట్టి ఇంజక్షన్లను రోగులకు కేటాయిస్తూ..ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్న వారికి కేటాయిస్తూ మెసెజ్‌లు పంపుతోంది. దీంతో రోగి సంబంధిత వ్యక్తులు ప్రభుత్వం కేటాయించిన ధరలు చెల్లించి ఇంజక్షన్లను పొందుతున్నారు..

తాజాగా ఇంజక్షన్ల సరఫరాలో మరింత పారదర్శకతను తీసుకువచ్చింది. రోగికి సంబంధించి ఇంజక్షన్లను పొందే విధానం అందరికి తెలియకపోవడంతోపాటు లాక్‌డౌన్ నిబంధనలతో రోగుల బంధువులు వాటిని డిస్ట్రీబ్యూటర్ల వద్ద తెచ్చుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నేరుగా ఆసుపత్రులకే ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇందుకోసం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరిండెంట్ శంకర్ అధ్యక్షతన ఓ కమిటిని వేసిన ప్రభుత్వం వీటిని సమన్వయం చేస్తోంది. ఈ పద్దతి ద్వార ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ తెలపాల్సి ఉంటుంది. కోత్త రోగులతోపాటు ఇంజక్షన్లు కావాల్సిన వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుది. ఆ వివరాల ఆధారంగానే ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు ఇంజక్షన్లను కేటాయిస్తోంది.. ఆసుపత్రుల యాజమాన్యాలు నేరుగా వెళ్లి డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొనుగోలు చేసి రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది..దీంతో సాధారణ రోగులకు ఎటువంటి టెన్షన్ లేకుండా వైద్యం అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..

ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఇరవై నుండి ముప్పై ఇంజక్షన్ల అవసరము ఉన్నా ప్రతి ఒక్కరికి అయిదు ఇంజక్షన్లను కేటాయిస్తోంది. కేంద్రం కేటాయిస్తున్న వాటిని బట్టి సర్ధబాటు చేస్తోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులకు ఆయా ఆసుపత్రులే ఉచితంగా వీటిని అందిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: