హోమ్ /వార్తలు /తెలంగాణ /

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శుభవార్త...త్వరలో హైటెక్‌సిటీకి మెట్రో పరుగులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శుభవార్త...త్వరలో హైటెక్‌సిటీకి మెట్రో పరుగులు

హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో రైలు

మెట్రో రాకతో నగరంలోని ఇలాంటి ప్రముఖ ప్రాంతాలకు రవాణా సదుపాయం మరింత మెరుగుపడనుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈరూట్లో ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందనున్నారు టెకీలు.

  హైదరాబాద్‌లోని సాప్ట్‌వేర్ ఉద్యోగుల కళ నెలవేరబోతోంది. టెకీలకు త్వరలోనే మెట్రో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అమీర్‌పేట్-హైటెక్ సిటీ మార్గంలో ఇప్పటికే ట్రయల్ రన్ జరుగుతోంది. ఇక త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గానికి కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సిఎంఆర్ఎస్) నుంచి అనుమతి లభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎలాంటి హార్భాటం లేకుండా సాదాసీదాగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు.


  అమీర్ పేట నుండి హైటెక్ సిటి వరకు 10 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 10 స్టేషన్లు వున్నాయి. అమీర్ పేట, మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, రాయదుర్గం స్టేషన్లున్నాయి. మెట్రో రాకతో నగరంలోని ఇలాంటి ప్రముఖ ప్రాంతాలకు రవాణా సదుపాయం మరింత మెరుగుపడనుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈరూట్లో ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందనున్నారు టెకీలు.


  నగరంలో ఇప్పటికే నాగోల్-అమీర్ పేట్, మియాపూర్-అమీర్‌పేట్, ఎల్‌బీనగర్-అమీర్‌‌పేట్ మార్గాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రోజుకు సుమారు లక్షల నుంచి 2 రెండుల లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. ఐతే టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో చిన్న ఉద్యోగులు, విద్యార్థులు మెట్రోకు దూరమవుతున్నారు. ధరలను తగ్గిస్తే మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మూడో ఫేజ్ (ఫలక్‌నుమా-జేబీఎఎస్ రూట్) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రూట్‌ కూడా ప్రారంభమైతే హైదరాబాద్‌లో మెట్రో సేవలుపూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లే..!

  First published:

  Tags: Hyderabad, Hyderabad Metro

  ఉత్తమ కథలు