హోమ్ /వార్తలు /తెలంగాణ /

Lockdown : తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్స్‌ల నిలిపివేత.. చిలికి చిలికి గాలివానగా మారనుందా..?

Lockdown : తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్స్‌ల నిలిపివేత.. చిలికి చిలికి గాలివానగా మారనుందా..?

ambulance issue : అందరు రావచ్చు, వైద్యం పొందవచ్చు అయితే...అంబులెన్స్ వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ

ambulance issue : అందరు రావచ్చు, వైద్యం పొందవచ్చు అయితే...అంబులెన్స్ వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ

Lockdown : తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారనుందా...హైకోర్టు చెబుతున్నా పొరుగు రాష్ట్రాల కరోన రోగులను ఎందుకు రానివ్వడం లేదు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం ఏపీ ప్రజలకు లేదా..?

లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో కఠిన నిబంధనలు పోలీసులు అమలు చేస్తున్నారు. పాసులు లేకుండా..రాష్ట్రంలోకి వస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. అంబులెన్స్‌లను సైతం వెనక్కి పంపించిన పరిస్థితి కనిపించింది. దీంతో పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇది రాజకీయ కారణాలకు దారి తీస్తుందా.. అనే అనుమానాలకు తెరలేపుతున్నారు.

తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్ర రవాణాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారని పోలీసులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా సాధారణ రాకపోకలతోపాటు ఎమర్జెన్సీ వాహనాలను కూడ పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంబులెన్సులను శుక్రవారం తెల్లవారుజామున 100 అంబులెన్సులు వరకు వెనక్కి తిరిగి వెళ్లినట్లు సమాచారం. దీంతో పక్క రాష్ట్రాల రోగులు ముఖ్యంగా ఏపి నుండి వస్తున్న వారే అధికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

అయితే తెలంగాణ ఆసుపత్రులకు వచ్చే వారికి ఇక్కడి ఆసుపత్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆసుపత్రుల్లో చికిత్స చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆసుపత్రుల నుండి అనుమతి లేఖను తీసుకోవాలని అనంతరం పోలీసు శాఖకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని నిబంధనలు విధించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఇదే అంశంపై రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.రోగుల ప్రవేశంపై రాష్ట్ర హైకోర్టు కూడ సిరియస్ అయింది. అంబులెన్స్‌లకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఏపి ప్రజలు కూడ తమకు తెలంగాణకు రావడానికి విభజన చట్టం ప్రకారం హక్కు ఉందని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోవచ్చని నిబంధనల్లో స్పష్టంగా పేర్కోన్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతులు తీసుకోవడం దారుణంగా పరిగణిస్తున్నారు.


దీంతో ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారనుందని కొందరు రాజకీయ నాయకుల విశ్లేషణగా చెబుతున్నారు. ఏ రాష్ట్రమైన సగటు మనిషి ప్రాణం కాపాడం ధర్మం. కాని ఇందుకు విరుద్దంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. లేదంటే విభజన హామిలు ఇందుకు అంగీకరించవా అనేది పాలకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది..

First published:

Tags: Ap, Corona, Lock down, Telangana

ఉత్తమ కథలు