Home /News /telangana /

Inspiration: అతడు లోకాన్ని చూడకపోవచ్చు.. కానీ లోకం అతడిని చూసే విధంగా చేసుకున్నాడు.. ఏం చేశాడో తెలుసా..

Inspiration: అతడు లోకాన్ని చూడకపోవచ్చు.. కానీ లోకం అతడిని చూసే విధంగా చేసుకున్నాడు.. ఏం చేశాడో తెలుసా..

లక్కీ మిరానీ

లక్కీ మిరానీ

Inspiration: సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు.. కానీ ఆ కండ్లె లేకపోతే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందా... అవునని నిరూపిస్తున్నాడు ఒక విద్యార్థి.  తనకు కండ్లు లేకపోయినా ఇతర విద్యార్థులతో పోటీపడి చదువులో రాణిస్తున్నాడు.

  (P.Srinivas,News18,Karimnagar) 

  సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు.. కానీ ఆ కండ్లె లేకపోతే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందా.. సాధ్యం అవుతుందని నిరూపిస్తున్నాడు ఒక విద్యార్థి.  తనకు కండ్లు లేకపోయినా ఇతర విద్యార్థులతో పోటీపడి చదువులో రాణిస్తున్నాడు. అన్ని అవయవాలు సరిగా ఉన్నా ఏమి సాధించలేని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరీంనగర్ జిల్లా కు చెందిన లక్కీ మిరానికి  చిన్నప్పుడే చూపు కోల్పోయాడు. ఎంతో కృషి ,పట్టుదలతో ఆత్మవిశ్వాసం తో కష్టపడి చదివి విద్యాభ్యాసంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లక్కీ మిరాని సాధించిన విజయాల పై న్యూస్ 18ప్రత్యేక కథనం..  కరీంనగర్ జిల్లా కు చెందిన లక్కి మిరాని అందరిలాగే బాల్యంలో సామాన్య బాలుడు.

  అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


  తాను మూడో తరగతిలో ఉన్నప్పుడు కంటి సమస్య వచ్చింది. సామాన్య సమస్య అని అతని తల్లిదండ్రలు డాక్టర్ కు చూపించితే  కొట్లలో ఒకరికి వచ్చే రెటినాల్ డిస్త్రోఫి అనే అరుదైన వ్యాధి అని తెలిసింది. ఈ అరుదైన వ్యాధి బారిన పడిన లక్కీ కి చూపు పూర్తిగా పోయింది. అధైర్య పడకుండా అతని తల్లిదండ్రులు లక్కీని ప్రత్యేక పాఠశాలకు కాకుండా అందరిలాగా సాధారణంగా స్కూల్ కకు పంపించారు. స్కూల్, కాలేజీ అధ్యాపకుల బోధనలు, మిత్రుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పదో తరగతిలో 10 జీపీఏ సాధించి రాష్ట్రంలో అందరి మన్ననలను పొందారు.

  Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..


  ఇంటర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లో చదివి కామర్స్ లో 96 శాతం సాధించి కాలేజీ టాపర్ గా నిలిచాడు.. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయిన లక్కి తండ్రి.. అతడిని ఎప్పటికప్పుడు చదువులో ఇంటివద్ద ప్రత్యేక శిక్షణ ఇచ్చేవాడు. లక్కి అల్ ఇండియా స్థాయిలో కేటగిరీ విభాగంలో మొదటి ర్యాంక్ ఓపెన్ కేటగిరీ లో 148 ర్యాంక్ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది అని.. చాలా మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీ లో సీటు సాధించాలని కలలు కంటారు.

  కాని లక్కి ఆత్మ విశ్వాసం కచ్చితమైన ప్రణాళికతో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎం ఏ పొలిటికల్ సైన్సు లో సీటు  సాదించడం చాలా సంతోషకరంగా ఉన్నట్లు లక్కి తండ్రి దీపక్ మిరాని ఆకాశవాణికి  తెలిపారు .చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల సహకారంతో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్, వివిధ మాధ్యమాల ద్వారా పాటలు శ్రద్ధగా వింటూ దేశంలో ఎవరూ సాధించని ఘనత సాధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

  Ideal Womens: గరిటె పట్టే చేతులతో స్టీరింగ్ పట్టిన మహిళలు.. ఇలా మారడానికి కారణాలెన్నో.. వివరాలివే..


  బారత దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు , నటీ నటులు సోను సూద్ షబానా అజ్మి  , ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఇలా చాలా మంది లక్కీని అభినందించారు. ఇప్పటివరకు 38 అవార్డ్ లు, రివార్డ్ లు పొందిన లక్కి మిరాని చాలా మందిచే సన్మానించబడ్డాడు. భవిష్యత్ లో యుపీఎస్సీలో పోటీ పడి ఉన్నత స్థానంలో నిలిచి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు లక్కీ  తెలిపారు.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Veera Babu
  First published:

  Tags: Trending news, VIRAL NEWS, Viral Video

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు