ఆరోగ్యశ్రీలోకి కరోనా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

ప్రజలకు కరోనా వైద్యం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న జగ్గారెడ్డి.. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

  • Share this:
    కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. తన ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకునే పనిలోనే ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వం ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు కరోనా వైద్యం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న జగ్గారెడ్డి.. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ చేయకపోతే తాను త్వరలోనే దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నివారణకు మందు వచ్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.
    First published: