హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal : బంగారంతో పోటి పడుతున్న మిర్చి.. తాజాగా @52000

Warangal : బంగారంతో పోటి పడుతున్న మిర్చి.. తాజాగా @52000

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Warangal : రాష్ట్రంలో వ్యవసాయ వాణిజ్య పంటలకు ఎప్పుడు లేని ధరలు రికార్డ్ అవుతున్నాయి. చరిత్రలో ఇలాంటి ధరలు ఎప్పుడు నమోదు కాలేదు.. ఇలా మిర్చీ క్వింటాలుకు 52 వేలు తాకి బంగారం రేటును మించిపోతుంది..

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా వ్యవసాయ పంటల ధరలు రికార్డుకెక్కాయి.. గత నెల రోజులుగా మిర్చీ ధరలు ఆకాశనంటుతున్నాయి..ఒక దశలో బంగారంతో పాటు నువ్వా నేనా అనే విధంగా మిర్చిలోని కొన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి.. ఈ సంవత్సరంలో ఇటివల కురిసిన వర్షాలకు మిర్చి పంటల దిగుబడి తక్కువ కావడంతో ఒక్కసారిగా వాటి ధరలు పెరుగుతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే సుమారు 20 వేల రూపాయల వరకు దీని ధరలు పెరిగాయి..ఈ క్రమంలోనే వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన సింగిల్ పట్టి రకం మిర్చి ధర క్వింటాలుకు 52వేల రూపాయలు పలికింది. అయితే ఈ రేటు అన్ని రకాలకు పలకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కొన్ని రకాలకే అధిక ధరలు లభించడంతో అదే క్వాలిటి మిర్చికి కూడా ధర లభించాలని మార్కెట్ ముందు కొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నారు.

సాధారణ రకాలు అదే దారి...

మరోవైపు సాధారణ మిర్చి ధరలు బహిరంగ మార్కెట్‌లో గత నెల రోజులుగా ఆకాశాన్ని అంటున్నాతున్నాయి. కనీస రకాలు సైతం 20వేలకు పైగా పలుకుతున్నాయి.. సాధారణంగా పది, లేదా పదిహేను వేల మధ్యలో ఉండే మిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగాయి... అయితే సింగిల్ పట్టి, చపాటా రకాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని పచ్చళ్లతో పాటు క్వాలిటి కారం పొడి లభిస్తోంది.

Hyderabad : దర్జాగా ఫ్లైట్‌లో వస్తాడు.. సింపుల్‌గా మెడలోని గొలుసులు తెంచుతాడు.. కాని...

ధరల పెరుగుదలకు అధిక వర్షాలే కారణం.

కాగా ఈ సంవత్సరం వేసిన మిర్చి పంట రైతుల్లో నిరాశనే మిగిల్చింది. ధర పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం లేదు. ఎందుకంటే గత రెండు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు దాదాపు మిర్చి పంటలన్ని నాశనం అయ్యాయి. దీంతో 90 శాతం రైతుల పంటలు వర్షం పాలు అయ్యాయి. దీంతో దిగుబడి రాలేదు. దీంతో కొన్ని ప్రత్యేక రకాల మిర్చితో పాటు సాధారణ మిర్చి రకానికి కూడా కనీస 15వేలకు పైనే ఉండడంతో రైతులకు కొంత ఊరట కల్గింది.

First published:

Tags: Telangana, Warangal

ఉత్తమ కథలు