హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jagityal School: తెలంగాణలోని పాఠశాలన్నింటికి ఓ రూల్​.. ఆ ఒక్క పాఠశాలకు మరో రూల్​.. తేడా ఏంటి?

Jagityal School: తెలంగాణలోని పాఠశాలన్నింటికి ఓ రూల్​.. ఆ ఒక్క పాఠశాలకు మరో రూల్​.. తేడా ఏంటి?

జగిత్యాలలోని గురుకుల పాఠశాల

జగిత్యాలలోని గురుకుల పాఠశాల

ప్రస్తుతం తెలంగాణలోని పాఠశాలలు అన్నింటిలో తరగతులు నడుస్తున్నాయి. కానీ, ఆ ఒక్క పాఠశాలలో మాత్రం తరగతులు నడవడం లేదు. అసలు స్కూల్​కి విద్యార్థులే రావడం లేదు. గత 15 రోజలు నుంచీ ఇదే తంతు.

పాఠశాలలన్నీ (All schools) ప్రభుత్వ విధివిధానాలు (Government rules) అనుసరించి నడుస్తాయి. స్కూలు ఎప్పుడు ప్రారంభం కావాలి..? ఏం టైంకి ప్రారంభం కావాలి? లంచ్​ టైం ఎంతసేపు ఉండాలి? ఎప్పుడు పాఠశాల టైం అయిపోవాలి..? ఇవన్నీ అధికారులు ఓ టైం టేబుల్​ ప్రిపేర్​ చేసి మరీ అన్ని పాఠశాలలకు పంపిస్తారు. కానీ, ఆ ఒక్క పాఠశాల మాత్రం కొంచెం తేడాగా ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం తెలంగాణలోని పాఠశాలలు అన్నింటిలో తరగతులు (Classes) నడుస్తున్నాయి. కానీ, ఆ ఒక్క పాఠశాలలో మాత్రం తరగతులు నడవడం లేదు. అసలు స్కూల్​కి విద్యార్థులే రావడం లేదు. గత 15 రోజలు నుంచీ ఇదే తంతు. అక్కడ చదువుకునే విద్యార్థులు ఏ పది మందో.. 50 మందో కాదు.. ఏకంగా 500 మంది. ఎవ్వరూ రావడం లేదు. ఏకంగా పాఠశాలకు సెలవులే (Holidays) ఇచ్చేశారు అధికారులు. ఎందుకు? ఏం జరిగింది? అక్కడ ఆ రూల్​ ఏంటి అనుకుంటున్నారా? వివరాలివే..

అది జగిత్యాల (Jagityala) జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లిలోని ఎస్సీ బాయ్స్​ గురుకులం (SC Boys gurukul). సొంత బిల్డింగ్ (Building) లేకపోవడంతో ఆఫీసర్లు ఓ ప్రైవేట్​బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను అద్దెకు తీసుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఏమాత్రం క్వాలిటీ లేకుండా నిర్మించిన ఈ బిల్డింగ్ ఇటీవలి వానలకు (heavy rains) దారుణంగా తయారైంది. వర్షం పడితే చాలు, గోడలు, స్లాబ్ ఉరుస్తున్నాయి. కిటికీలకు డోర్స్ లేకపోవడంతో హాస్టల్ రూముల్లోకి వాన నీరు చేరుతోంది. రాత్రిళ్లు వానపడితే పడుకునే పరిస్థితి లేకపోవడంతో స్టూడెంట్స్  (Students) తెల్లవార్లు జాగారం చేస్తున్నారు.

TSRTC: టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. మూడు నెలల్లో ఆ నియామకాలు పూర్తి..

ఈ బిల్డింగ్ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో చుట్టూ నీరు చేరి బయట అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పైగా వరద నీటి వల్ల గురుకులం ప్రాంగణంలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 15 రోజుల కిందట ప్రహరీ గోడ కూలింది. అదృష్టవశాత్తు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఏమీ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్కూల్‌‌‌‌‌‌‌‌ను (School) నిర్వహించలేమంటూ ప్రిన్సిపల్, టీచర్లు చేతులెత్తేశారు. పై ఆఫీసర్ల నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకుని 15 రోజుల కిందట సెలవులు ప్రకటించారు. దీంతో  ఇళ్లకు వెళ్లిపోయారు విద్యార్థులు.

పాఠశాల భవనం వద్ద నీరు

Group 4: నిరుద్యోగులకు షాక్​..  గ్రూప్​ 4 ఖాళీల్లో సగానికి పైగా ఆ విధంగా భర్తీ చేస్తున్నారా?

అయితే పదిహేను రోజులవుతున్నా ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు (Parents) అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఇలా అర్ధంతరంగా సెలవులు ప్రకటిస్తే ఎలా అని వాపోతున్నారు. ఇప్పటికే 15 రోజులైందని తమ పిల్లలు మిగతా విద్యార్థులతో పోలిస్తే చదువులో వెనకబడే అవకాశం ఉందని కూడా వాదిస్తున్నారు.

First published:

Tags: Jagityal, Karimangar, School

ఉత్తమ కథలు