Home /News /telangana /

ALL SIX MLA QUOTA TRS MLCS UNANIMOUSLY ELECTED ANNOUNCES EC WHO WILL GET CHANCE INTO KCR CABINET MKS

trs mlc : ఏకగ్రీవ విజయాలపై అధికారిక ప్రకటన -వీళ్లలో kcr కేబినెట్ బెర్త్ ఎవరికి?

ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైన‌ట్లు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి సోమవారం వెల్ల‌డించారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Election) ప్రహాసనంలో ఒక అధ్యాయం ముగిసింది. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన‌ ఆరుగురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైన‌ట్లు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

నాటకీయ పరిణామాల మధ్య ఈ నెల 16న టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్య‌ర్థులు గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, పాడి కౌశి‌క్‌‌రెడ్డి, వెంక‌ట్రా‌మి‌రెడ్డి, తక్కె‌ళ్ల‌పల్లి రవీం‌ద‌ర్‌‌రావు నామి‌నే‌షన్లు దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ను హుటాహుటిని ఎమ్మెల్సీగా ప్రకటించడం, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా రాజీనామా చేసిన 24 గంటల్లోనే వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కడం లాంటి విచిత్రాలెన్నో జరిగాయి. కాగా, ఈనెల 16నే మరో ఇద్దరు స్వతంత్ర అభ్య‌ర్థుల నామినేషన్లను ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి తిర‌స్క‌రిం‌చారు. దీంతో టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్య‌ర్థుల ఎన్నిక ఏక‌గ్రీ‌వ‌మైంది. ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడింది.

చివరిరోజు cm kcr ట్విస్ట్ -కూతూరికి రాజ్యసభ నో -ఆ జిల్లా ఎమ్మెల్సీగా మళ్లీ kalvakuntla kavithaఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు గెలుపు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామి రెడ్డి, కౌశిక్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. తమకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎదుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని కడియం శ్రీహరి ఆరోపించారు. ధాన్యం సేకరణ కేంద్రం పరిధి అయినా కొనడంలేదన్నారు. మరోవైపు,

cm kcr: ఉత్తరాది రైతులు సరే, తెలంగాణ అమరులు, రైతుల ఆత్మహత్యలకు trs సర్కార్ ఏమిచ్చింది?
ఎమ్మెల్యే కోటా 6 ఎమ్మెల్సీలు ఏకగ్రీవంకాగా, స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలకు మంగళవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలకు తెరదించుతూ ఆమెను నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగానే మరోసారి అవకాశమిచ్చారు సీఎం కేసీఆర్. మిగతా జిల్లాల్లో అభ్యర్థులుగా, మహబూబ్‌నగర్- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్, రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ- ఎంసీ కోటిరెడ్డి, మెదక్- డాక్టర్ యాదవరెడ్డి, కరీంనగర్- ఎల్.రమణ, భాను ప్రసాద్‌రావు ఉన్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే నామినేషన్లు వేశారు. కవిత, మిగిలినవాళ్లు మంగళవారం నామినేషన్లు వేస్తారు. స్వల్ప వ్యవధిలోనే 19 ఎమ్మెల్సీల భర్తీ చేపట్టిన కేసీఆర్.. వాళ్లలో ఎంతమందిని తన కేబినెట్ లోకి తీసుుకంటారనేది చర్చనీయాంశమైంది. ఈటల రాజేందర్ సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాశ్ కు బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ప్రక్రియ ముగిసిన వెంటనే కేబినెట్ పునర్యవస్థీకరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Mlc elections, Telangana News, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు