Home /News /telangana /

ALL SET FOR COVID PATIENTS IN MEDAK DISTRICT HOSPITAL SAID HARISH RAO VRY MDK

Harish Rao : అందుబాటులో రెమిడెసివిర్ ఇంజక్షన్లు..కొరత లేదన్న మంత్రి హరీష్ రావు

అందుబాటులో రెమిడెసివిర్ ఇంజక్షన్లు..కొరత లేదన్న మంత్రి హరీష్ రావు

అందుబాటులో రెమిడెసివిర్ ఇంజక్షన్లు..కొరత లేదన్న మంత్రి హరీష్ రావు

Medak : జిల్లాలో రెమిడిసివిర్, ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి టి.హరీష్ రావు వెల్లడించారు. గురువారం కోవిడ్, ఇతర అంశాలపై కల్లెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వంద మంది, ప్రైవేటు ఆసుపత్రులలో 206 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ,ఇప్పటి వరకు 743 మంది కోవిడ్ రోగులకు రెమిడిసివిర్ ఇచ్చామని, ఇంకా 219 అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో రేమిడిసివేర్, ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేసారు. అలాగే పి.హెచ్.సి.లలో 3,550 ఆర్.టి.పి.సి.ఆర్. 2,275 రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఆయుష్మాన్ క్రింద 10 మంది డాక్టర్లను, 20 మంది నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేసి కోవిడ్ రోగులకు మరింత మెరుగైన సేవలు మానవతా దృక్పథంతో అందించవలసినడిగా మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధిరిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 10 లక్షల కోవాగ్సిన్ టీకా మందు కొనుగోలు చేస్తున్నదని, వచ్చిన వెంటనే జనం మధ్య తిరిగే, జన సమూహంలో ఉండే 18-45 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ,ఆటో రిక్షా, టాక్సి, రేషన్ దుకాణాలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, మాంసం దుకాణాలు, పేపర్ బాయ్స్, వడ్ల కొనుగోలు తదితరులకు టీకా ఇస్తామని, అటువంటి వారు జిల్లాలో ఎంతమంది ఉన్నారో గుర్తించాలని డి.యమ.అండ్ హెచ్.ఓ.కు సూచించారు.

ఇంటింటి జ్వర సర్వే ద్వారా స్వల్ప లక్షణాలతో బాధపడుచున్న ఏడు వేల మందిని గుర్తించి 8 రకాల మందుల కిట్, ప్రిస్క్రిప్షన్ ఇచ్చామని, అందులు 4 వేల మంది కోలుకున్నారని, మరో 3,067 మంది ఐసోలేషణ్ లో ఉన్నారని వారిని రోజు ఫోన్ ద్వారా పలకరించి ధైర్యం చెప్పాలని సూచించారు. గతంలో ర్యాండం గా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 24 శాతం పాజిటివ్ కేసులు వచ్చేవని, నేడు ఇంటింటి సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు నిర్వహించి ఐసోలేషణ్ చేసి కట్టడి చేయడం ద్వారా 11 శాతానికి వచ్చాయని అన్నారు. అలాగే రోజు 4, 5 మరణాల నుండి 1, 2 కు తగ్గాయని, లాక్ డౌన్ కటినంగా అమలు చేస్తే జిల్లాలో కరోనాను పూర్తిగా కట్టడి చేయవచ్చని అన్నారు.

ఉదయం 6 నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ ఉండగా 8 గంటల తరువాత ప్రజలు ఎక్కువగా బయటి వస్తు నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, మాంసం దుకాణాల వద్ద గుమికూడుతున్నారని తద్వారా లాక్ డౌన్ పెట్టిన ఉద్దేశం నెరవేరదని, ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటికి కావలసిన వస్తువులు,కూరగాయలను వారానికి సరిపడా ఒకే సారి తీసుకెళ్లాలని, తమ కుటుంబం, సమాజం పట్ల భాద్యతతో ఇంటి నుండి ఒక్కరే బయటికి రావాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ యస్. హరీష్, అదనపు కలెక్టర్ జి.రమేష్, మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టి.యస్.పి.యస్..సి. సభ్యుడు ఆర్.సత్యనారాయణ, డి.యమ.అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్ రావు, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.యస్.ఓ. శ్రీనివాస్, డి.యస్.ఫై. కృష్ణ మూర్తి, ఆర్.డి.ఓ.సాయి రాం తదితరులు పాల్గొన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Harish Rao, Medak Dist

తదుపరి వార్తలు