ఎంసెట్ సహా తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా నేపథ్యంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

news18-telugu
Updated: June 30, 2020, 3:00 PM IST
ఎంసెట్ సహా తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో... ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఐతే జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ ఉంటుందా లేదా అన్నది కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపిన ఏజీ(అడ్వకేట్ జనరల్) హైకోర్టుకు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్ణయం చెబుతామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది ఉన్నత విద్యా మండలి.

ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా అందరినీ పాస్ చేసింది. ఫలితాలకు సంబంధించి గ్రేడ్లను కూడా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా అన్ని ప్రవేశ పరీక్షలను సైతం వాయిదావేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించించిన విషయం తెలిసిందే. జూలై నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని స్పష్టం చేసింది.

కాగా, తెలంగాణలో సోమవారం 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 253 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులున్నాయి
First published: June 30, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading