• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • ALL ARRANGEMENTS COMPLETED FOR NAGARJUNA SAGAR BY ELECTIONS WHICH WILL BE HELD ON TOMORROW AK

Telangana: సాగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. మాస్క్ ఉంటేనే ఓటేసేందుకు అనుమతి.. చివరి గంట వారికే..

Telangana: సాగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. మాస్క్ ఉంటేనే ఓటేసేందుకు అనుమతి.. చివరి గంట వారికే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 108 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.

  • Share this:
    నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,20,300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. కరోనా నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు సమయాన్ని కేటాయించారు. పోలింగ్‌కు సంబంధించి మొత్తం 5 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో 2,20,300 మంది ఓటర్లు ఉండగా 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.

    నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 108 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 15 మంది పోలీస్ సిబ్బందికి తగ్గకుండా బందోబస్తు నిర్వహించనున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల వద్ద 4వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అందులో 1000 మంది సాయుధ దళాల పోలీసులున్నారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 1000మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు.

    రాత్రి 7 గంటల వరకు ఓటు వేసేందుకు సమయం ఉండగా చివరి గంట కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కేటాయించారు. సాగర్ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి హిల్ కాలనీలో, టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ ఇబ్రహీంపేట, బీజేపీ అభ్యర్థి త్రిపురారం మండలంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు.. ముమ్మరంగా ప్రచారం చేశాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు