Fack check : గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరార్ వార్తలో నిజమెంత..?

గాంధీ ఆస్పత్రి నుంచి పరారయ్యాడో కరోనా రోగి. గద్వాలకు చెందిన ఆ వ్యక్తి నిన్న రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకున్నాడు.

news18-telugu
Updated: April 6, 2020, 1:01 PM IST
Fack check : గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరార్ వార్తలో నిజమెంత..?
గాంధీ ఆస్పత్రి
  • Share this:
గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరారైనట్లు వార్తలు వస్తున్నాయి.గద్వాలకు చెందిన ఆ వ్యక్తి నిన్న రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకున్నాడని, దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టినట్లు సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ మర్కజ్ యాత్రికుల ద్వారా ఇతనికి వైరస్ సోకినట్లు ఆ వార్తలో తెలిపారు. అయితే, ఆ వార్తలో నిజం లేదని చిలకలగూడ పోలీసులు తెలిపారు. సీఐ బాల గంగిరెడ్డి మాట్లాడుతూ.. బాత్ రూమ్ వెళ్లే సమయంలో కనిపించకపోవడంతో తప్పుడు ప్రచారం జరిగిందని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో బందోబస్తు పటిష్ఠంగా ఉందని, ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.
First published: April 6, 2020, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading