హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు అలెర్ట్​.. నేటి నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభం

Telangana: తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు అలెర్ట్​.. నేటి నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దేశానికి గ్రామాలే వెన్నెముక, ప్రగతికి పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాలను ప్రభుత్వాలు ఎంత పట్టించుకుంటే అంత మంచిది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనుంది.

దేశానికి గ్రామాలే  (Villages)వెన్నెముక, ప్రగతికి పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాలను ప్రభుత్వాలు ఎంత పట్టించుకుంటే అంత మంచిది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనుంది. శుక్రవారం పల్లె ప్రగతి (Rural Progress), కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ (Corona Vaccination Drive) తదితర కార్యక్రమాలు మొదలుపెట్టనుంది.  తెలంగాణ (Telangana)లో నేటి నుంచి వచ్చే నెల చివరి వరకూ ఈ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హెల్త్ వర్కర్లు ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి 2 టీంలు ఏర్పాటు చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక టీం.. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సినేషన్​ క్యాంపునకు తరలిస్తుంది. ఇంకో టీం గ్రామంలోని ఏదో ఒక చోట క్యాంపు పెట్టి టీకా వేస్తుంది. రాష్ట్రంలో 16.36 లక్షల మంది సెకండ్ డోసు వ్యాక్సిన్​ తీసుకోవాల్సి ఉంది. 29.51 లక్షల మంది బూస్టర్ డోసుకు అర్హత పొందారు. 12 నుంచి 18 ఏండ్ల ఏజ్‌‌ గ్రూపు పిల్లల్లో 70,827 మంది కనీసం ఒక్క డోసు కూడా వేసుకోలేదు.

15 రోజుల పాటు పల్లెప్రగతి..

తెలంగాణ (Telangana)లో  పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే పల్లెప్రగతి ఐదో విడత, పట్టణప్రగతి నాలుగో విడతలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రధాన అంశాలు. నీరు, విద్యుత్తు సౌకర్యం లేని వైకుంఠధామాలకు వెంటనే ఆ సౌకర్యాలు కల్పిస్తారు. పల్లె, పట్టణ ప్రగతి పర్యవేక్షణకు మండలానికి జిల్లా స్థాయి అధికారి, వార్డుకు ప్రత్యేక అధికారి, పంచాయతీకి మండలస్థాయి అధికారిని నియమించారు. పంచాయతీ, పట్టణ వార్డు, డివిజన్‌కు కమిటీలను ఏర్పాటుచేశారు. గ్రామ కమిటీలో సర్పంచ్‌ అధ్యక్షుడిగా ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్తు లైన్‌, మిషన్‌ భగీరథ టెక్నిషియన్‌ సభ్యులుగా ఉంటారు.

మొదటి రోజు వార్డు సభ..

పల్లె, పట్టణ ప్రగతిలో మొదటి రోజు గ్రామంలో పాదయాత్ర చేపట్టి గ్రామసభ నిర్వహించాలని మార్గదర్శకాలు జారీచేశారు. పట్టణ ప్రగతిలో మొదటి రోజు వార్డు సభ నిర్వహించి ప్రణాళిక తయారు చేస్తారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలు, గత విడతల్లో సాధించిన విజయాలను నివేదిక రూపంలో వార్డు, గ్రామ సభలో చదివి వినిపిస్తారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్టాండింగ్‌ కమిటీ సభ్యులంతా పాల్గొనేలా చూడాలి. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇప్పటికే సిద్ధం చేసిన క్రీడా ప్రాంగణాలను మొదటి రోజు ప్రారంభిస్తారు. మండలానికి కనీసం రెండు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో అన్నిరోజులు రోడ్లను, మురుగు కాలువలను శుభ్రపరచాలి. పల్లె ప్రగతి జరిగే అన్ని రోజులు ఇండ్ల నుంచి మురుగు నీరు రాకుండా, నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి ఇంటికి మ్యాజిక్‌ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడాన్ని ప్రోత్సహించాలని అధికారులు తెలిపారు.

First published:

Tags: Corona Vaccine, Telangana, Village

ఉత్తమ కథలు