Akshaya Tritiya 2019: అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే పాపం.. చాగంటి సంచలన వ్యాఖ్యలు..

Akshaya Tritiya 2019 | అక్షయ తృతీయ రోజున బంగారం కంటే పాపం మూటగట్టుకున్నట్లేనని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

news18-telugu
Updated: May 6, 2019, 6:13 PM IST
Akshaya Tritiya 2019: అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే పాపం.. చాగంటి సంచలన వ్యాఖ్యలు..
చాగంటి కోటేశ్వరరావు (image: facebook)
news18-telugu
Updated: May 6, 2019, 6:13 PM IST
అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. జ్యూవెలరీ షాపులు కళకళలాడిపోతాయి.. ఉన్నవారైనా.. లేనివారైనా సరే.. ఎంతో కొంత బంగారం కొంటుంటారు. అయితే ఇలా బంగారం తీసుకోవడం మంచిదా.? కాదా..? అన్న విషయంపై ఎప్పట్నుంచో పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే దరిద్రం అని.. పాపం చుట్టుకుంటుందని ఆయన ప్రవచించారు. అసలు బంగారం కొనాలని ఎవరూ చెప్పారంటూ ఆయన ప్రశ్నించారు. అక్షయతృతీయ సమయంలో చాగంటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికీ.. చాగంటి వ్యాఖ్యల్లోనూ నిజముందంటూ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఏ ధర్మశాస్త్రాల్లోనూ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలంటూ లేదని.. ఈ ఆచారం ఎలా వచ్చిందో కూడా తమకు తెలియదని చెబుతున్నారు. ఆరోజున బంగారం కొని తీరాలని ఏ ధర్మశాస్త్రాలు చెప్పలేదంటున్నదానాలు చేస్తే మంచిది అని చెబుతున్నారు. ఈ ఆచారం ఎలా వచ్చిందో కూడా తెలియదని.. కొన్ని ఏళ్లుగా ఈ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు..

మరోవైపు.. చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు బంగారం కొనుగోళ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అక్షయతృతీయకు కొన్ని గంటల ముందునుంచే బంగారం కొనుగోళ్లు మూడుఉంగరాలు.. ఆరు నగలుగా సాగుతున్నాయి.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...