AKHANDA FILM UNIT ALONG WITH HERO BALAKRISHNA VISITS YADADRI TEMPLE TODAY VRY HYD
Yadadri : యాదాద్రిని దర్శించుకున్న అఖండ టీం.. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనన్న హీరో...
Yadadri : యాదాద్రిని దర్శించుకున్న ఆఖండ టీం..
Yadadri : అఖండ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అఖండ యూనిట్ సభ్యులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అఖండ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అఖండ యూనిట్ సభ్యులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రజలందరినీ భగవంతుడు రక్షించాలని కోరారు హీరో నందమూరి బాలకృష్ణ.అనంతరం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని బాలకృష్ణ అన్నారు. మనిషి ఎంత కష్టపడినా అంతిమంగా దైవ అనుగ్రహం ఉంటేనే విజయం సంపూర్ణం అవుతుందని.. ఆ నమ్మకంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. తనకు లక్ష్మి నర్సింహస్వామి అంటే అత్యంత ఇష్టమని అన్నారు. అందుకే గతంలో అనేక సనిమాల్లో నటించానని చెప్పారు.
ఇక యాదాద్రి పునర్నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో యాదాద్రి క్షేత్రం ఒక మహిమాన్విత క్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అఖండ సినిమా అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ఆయన మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. హీరో నందమూరి బాలకృష్ణ తో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.