హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన..ఏకంగా 50 స్థానాల్లో పోటీ!

Big News: వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన..ఏకంగా 50 స్థానాల్లో పోటీ!

తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీలో MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ అసెంబ్లీలో MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం MIMకు  ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా మేము 50 స్థానాల్లో పోటీ చేస్తాం. అంతేకాదు అసెంబ్లీలో 15 మంది MIM ఎమ్మెల్యేలు ఉండేలా చూసుకుంటాం అని అన్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసి తెలిపారు. కాగా మరికొన్నిరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉండగా..MIM ఎమ్మెల్యే ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే  రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా..ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న వారికి  గంటసేపు కేటాయిస్తే తమకు ఎంత సమయం కేటాయిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో MIM ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని ఈ ప్రకటన చేసినట్లు అర్ధమవుతుంది.

BRS: కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించే బాధ్యతలు ఇవేనా? ఆ పరిణామాలు దేనికి సంకేతం?

అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్..

అసెంబ్లీలో అన్నీ చెబుతారు కానీ..బయట నెరవేర్చరంటూ MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ వాదించారు. ఉర్ధూ రెండో భాష అయినా అన్యాయమే జరుగుతుంది. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవనివ్వడం లేదన్నారు. మీరు చెప్రాసీని చూపిస్తే వారినైనా కలుస్తాం అని  MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చిందని..కానీ బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీకి మద్దతు ఇవ్వొద్దన్నామని, బీజేపీ మొదటి నుండి తెలంగాణకు అన్యాయమే చేస్తుందన్నారు. ఇటు బీఆర్ఎస్ పై, అటు బీజేపీపై చంద్రయాన్ గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారు.

KTR: రైతుబంధు పరిమితి..అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

కల్పించుకున్న మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి..

ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదని మంత్రి కేటీఆర్ (minister Ktr) కల్పించుకున్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన  ఉపయోగం ఉండదు. అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) బిఏసి సమావేశానికి రాకుండా మాట్లాడడం సరికాదు. మంత్రులు అందుబాటులో లేరనడం కరెక్ట్ కాదని మంత్రి కేటీఆర్  (minister Ktr) తెలిపారు. ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..మాకు కోపం రావడం లేదు. అక్బరుద్దీన్ ఒవైసీకి కోపం వస్తుంది. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఒవైసీ బాగానే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అక్బరుద్దీన్ కు ఎందుకు కోపం వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడాలని అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలతో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగాయి.

First published:

Tags: Akbaruddin owaisi, Minister ktr, Telangana

ఉత్తమ కథలు