మళ్లీ రావాలి..కేటీఆర్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ ట్వీట్‌కు స్పందించిన అసదుద్దీన్..ఆ ఘనతంతా మాజీ మంత్రి కేటీఆర్‌దేనని ప్రశంసించారు. ఆయన మళ్లీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: August 26, 2019, 4:45 PM IST
మళ్లీ రావాలి..కేటీఆర్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
కేటీఆర్, ఓవైసీ
  • Share this:
కేటీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఐటీ, మున్సిపల్, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా ఐటీశాఖ మంత్రిగా పాలనలో తనదైన ముద్రవేశారు కేటీఆర్. ఇక డిసెంబర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పరమైన కార్యక్రమాలకు మాత్రమే కేటీఆర్ పరిమితమయ్యారు. మంత్రి పదవిలో లేనందున పాలన వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్‌ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరానికి గత ఏడాది ఒప్పో, ఇటీవల అమెజాన్, తాజాగా వన్‌ప్లస్ వచ్చిందని ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. దిగ్గజ కంపెనీల రాకతో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు స్పందించిన అసదుద్దీన్..ఆ ఘనతంతా మాజీ మంత్రి కేటీఆర్‌దేనని ప్రశంసించారు. ఆయన మళ్లీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఓవైసీ తెలిపారు. ట్విటర్‌లో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>