• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • AIMIM ADILABAD PRESIDENT FAROOQ AHMED GUN FIRING ON TWO PEOPLE BA

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం, ఇద్దరిపై కాల్పులు జరిపిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం, ఇద్దరిపై కాల్పులు జరిపిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు

ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ దాడిలో గాయపడిన వ్యక్తి

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ కాల్పులు జరిపాడు. ఇద్దరిపై ఆయన కాల్పులు జరిపాడు.

  • Share this:
    ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ కాల్పులు జరిపాడు. ఇద్దరిపై ఆయన కాల్పులు జరిపాడు. ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ తన లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఒక వ్యక్తి పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇద్దరి మీద కాల్పులు జరిపిన ఫారూక్ అహ్మద్ మరొకరిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారు ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం లభించిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రిమ్స్ ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకుంటున్నారు. ఎంఐఎం కార్యకర్తలు కూడా వస్తున్నారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిల్లలు క్రికెట్ ఆడుకునే విషయంలో గొడవ మొదలైంది. ఆదిలాబాద్‌ టూటౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న తాటిగూడలో సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ పిల్లల గొడవలో పెద్దలు జోక్యం చేసుకున్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ తన లైసెన్స్‌డ్ గన్‌ (.32 పిస్టల్)తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సయ్యద్ జమీర్‌కు రెండు బుల్లెట్లు తగిలాయి. సయ్యద్ మోతేశ్యామ్ అనే వ్యక్తి కడుపులోకి మరో బుల్లెట్ దూసుకెళ్లింది. సయ్యద్ మన్నన్ అనే వ్యక్తి మీద కత్తితో దాడి చేయడంతో అతడికి గాయమైంది. ఈ ఘటనకు సంబంధించి ఫరూక్ మీద పోలీసులు హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు. అతడు కాల్పులు జరిపిన పిస్టల్‌ను సీజ్ చేశారు. పరూక్ ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు