హోమ్ /వార్తలు /తెలంగాణ /

Agros: నిరుద్యోగులు, బిజినెస్​ చేయాలనుకునే వారికి ‘‘అగ్రోస్​’’ బంపర్​ ఆఫర్​..

Agros: నిరుద్యోగులు, బిజినెస్​ చేయాలనుకునే వారికి ‘‘అగ్రోస్​’’ బంపర్​ ఆఫర్​..

ఆగ్రోస్​ పెట్రోల్​ బంకు

ఆగ్రోస్​ పెట్రోల్​ బంకు

నిరుద్యోగులు, కొత్తగా బిజినెస్​ ప్రారంభించాలనుకునేవారికి అగ్రోస్​ సంస్థ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. తక్కువ ఖర్చుతోనే వ్యాపారం చేసేలా సాయం చేస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Sayyad Rafi, News18, Mahbubnagar)

  తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నూతనంగా అగ్రోస్ పెట్రోల్ బంకులు (Agros Petrol bunks) వస్తున్నాయి.  నాణ్యమైన ఇంధనాన్ని వినియోదారుకులకు అందించడంతోపాటు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా లభించనున్న నేపథ్యంలో అగ్రో సంస్థ (Agro Company) కొత్తగా ఈ పెట్రోల్ బంకులు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి పాలమూరు (Mahbubnagar) జిల్లాలో మొట్టమొదటి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేయడంతో పాటు త్వరలోనే మరో పెట్రోల్ బంకులు నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లాలో కూడా వస్తున్నాయి. నాణ్యమైన ఇంధనాన్ని వినియోగదారులకు అందించాలి. దానితోపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో  తెలంగాణ రాష్ట్ర అగ్రో సంస్థ పెట్రోల్ బంకులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వనపర్తి  (Wanaparti)జిల్లాలో మొదటి పంపును ఏర్పాటు చేసింది. త్వరలోనే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాటు  రహదారిపై రెండు పంపులను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా అగ్రోస్ కర్షక్ పెట్రోల్ పంపులను హైదరాబాద్ (Hyderabad), వరంగల్ నల్లగొండ తో పాటు తదితర జిల్లాలో ఏర్పాటు చేశారు.

  నిరుద్యోగులకు సువర్ణావకాశం..

  నిరుద్యోగులు (Unemployed) పెట్రోల్ పంపులను నిర్వహించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా అగ్రోస్ సంస్థ ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తుంది. ఎక్కువగా వాహనాలు రాకపోకలు, రద్దీ ఉండే రహదారి పక్కనే అర ఎకరం నుంచి ఎకరా స్థలం ఉంటే చాలు అగ్రో సంస్థ కర్షక్ పెట్రోల్ పంపును (Karshak Petrol Pump) ఏర్పాటు చేస్తుంది. వాహన వినియోగదారులకు ఇలాంటి కల్తీ లేని నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అందుతుందన్న ఉద్దేశంతో అగ్రోస్ కర్షక్ పెట్రోల్ పంపు లను ఏర్పాటు చేస్తుంది.

  నిర్వహణ అంతా వారిదే..

  పెట్రోల్ పంపు ఏర్పాటు చేసుకోవాలనుకున్న లబ్ధిదారులు తనకున్న స్థలాన్ని చూపుతూ దరఖాస్తు చేసుకుంటే అగ్రోస్ అధికారులు స్థలాన్ని పరిశీలించి మంజూరు చేస్తారు. ఆ స్థలంలో లబ్ధిదారులు పెట్రోల్ పంపు ఏర్పాటుకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుంటే మిగతా ఏర్పాట్లను అగ్రోస్ సంస్థ చేస్తుంది. ఇక పంపు నిర్వాహణ మొత్తం అగ్రో సంస్థ చూసుకుంటుంది. పారదర్శకత నాణ్యతలో రాజీ పడకూడదన్న లక్ష్యంతోని సమస్తం తానే పంపులను నిర్వహిస్తుంది.

  Online Rummy: జీవితాలను కూల్చివేస్తున్న ఆన్​లైన్​ రమ్మీ.. ఒక్కరోజులోనే వేలకు వేలు తగలేస్తున్న జనం

  వచ్చిన లాభాల్లో లబ్ధిదారుకు 75% పంచుతుంది. 25 శాతం సంస్థ తీసుకుంటుంది. పెట్రోల్ బంక్ కు వచ్చే ఆదరణ గిరాకీ పట్టి పంపుల సంఖ్యను పెంచుతూ పోతుందని అగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ కె రాములు తెలిపారు. దానితోపాటు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కోసం అగ్రో సంస్థ అందించే స్వయం ఉపాధి అవకాశాన్ని అందించుకోవచ్చు. ఎక్కడైనా సంస్థ ద్వారా కర్షక పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసుకోవచ్చని దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తానని ఆయన అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Business Ideas, JOBS, Mahbubnagar, Petrol pump, Wanaparthi

  ఉత్తమ కథలు