తెలంగాణ (Telangana)లో వానాకాలం పంటలపై (Monsoon season crops) ఎలాంటి ఆంక్షలు లేవని, రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Agriculture Minister Niranjan Reddy) తెలిపారు. అయితే వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా ఉండటంతో వాటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వానకాలం పంటలపై ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వరిపై ఆంక్షలు లేవని, లాభసాటి పంటలు (Profitable crops) పండించేలా రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ధాన్యం సేకరణ (paddy procurement) నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని, బియ్యం కాకుండా వడ్లు కొనుగోలు చేయాలని చెబుతున్నామన్నారు. వరికి మించి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుములు సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
పెసలు క్వింటాలుకు రూ.7600..
ఈ ఏడాది కేంద్రం పత్తి క్వింటాలు రూ.5726 నుంచి గరిష్టంగా రూ.6025 ధర ప్రకటించిందని తెలిపారు మంత్రి. కానీ పత్తికి క్వింటాలు రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పైగా బహిరంగ మార్కెట్లో ధర లభించిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. పెసలు క్వింటాలుకు రూ.7600 వరకు, కందులు క్వింటాకు రూ.6700 వరకు, మినుములు రూ.6500 వరకు, వేరుశెనగ రూ.8 వేల పై చిలుకు బహిరంగ మార్కెట్లో ధర పలికిందన్నారు. వరి సాగుకు మించి తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి, తక్కువ పంట కాలంలో రైతులకు ఎక్కువ లాభం కళ్ల ముందు కనిపిస్తోందని, రైతులను ఈ దిశగా ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు ఆయన.
4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి..
రైతులు (farmers) పత్తి వేయకుండా గత ఏడాది పెద్ద ఎత్తున నష్టపోయారని మంత్రి గుర్తుచేశారు. అందుకే ఈ సారి వారిని పత్తి వేయాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. కంది సాగు తో భూసారం పెరగడమే కాకుండా తక్కువ పెట్టుబడి, నీటి ఎద్దడిని తట్టుకుని 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అన్నారు. అభ్యుదయ రైతులు 12 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి సాధిస్తూ అధిక లాభాలు అర్జిస్తున్నారని, క్రమంగా రైతులు కూడా అలవాటు పడుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ వ్యవసాయరంగంలో అమలవుతున్న విధంగా పథకాలు లేవు అన్నారు. కానీ కొందరు కురచ బుద్ధితో తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. వరితో పోల్చితే పత్తి, కంది, పెసర్లు, మినుము వంటి ఇతర పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతోపాటు మద్దతుకు మించి ధర పలుకుతున్నదని వివరించారు.
రైతులు (Farmers) తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకుపోవడం కాకుండా, మార్కెట్టే రైతు కల్లం వద్దకు రావాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. కొందరు స్వార్థపరులు ప్రభుత్వ లక్ష్యాన్ని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెట్టడం వల్లే ఆ సీజన్‌లో ఇతర పంటలు వేయాలని సూచించినట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Farmers, Monsoon, Paddy