Home /News /telangana /

AGNIPATH ROW SECUNDERABAD RAILWAY STATION DAMAGE COST RS 20 CRORE MMTS METRO RAIL STOPPED IN HYDERABAD ALERT ACROSS TS

Agnipath Row : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసంతో నష్టం ఎంతంటే.. తెలంగాణ అంతా టెన్షన్

సికింద్రాబాద్ ఘటన తర్వాత తెలంగాణలో అలర్ట్

సికింద్రాబాద్ ఘటన తర్వాత తెలంగాణలో అలర్ట్

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం అయ్యాయి. దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. నష్టం విలువ రూ. కోట్లలో ఉందని అధికారులు చెప్పారు..

ఆర్మీలో నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు (Agnipath Scheme Row) ఉధృతం అయ్యాయి. శుక్రవారం నాటికి నిరసనలు తెలంగాణకూ విస్తరించాయి. దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway station)లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు.

ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఘటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోనూ ఖాజీపేట సహా అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఖాజీపేట రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల మోహరింపు

Agnipath Row : ఏపీలో హైఅలర్ట్ -సికింద్రాబాద్ ఘటనతో విజయవాడ, ఇతర స్టేషన్లలో ఇలా..


అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు.

ఆదిలాబాద్ స్టేషన్ వద్ద

Agneepath Row : హైదరాబాద్‌లో అగ్నిపథ్ నిప్పులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు నిప్పు..


సికింద్రాబాద్ తోపాటు కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. స్టేషన్లలోకి ఎవరినీ అనుమంతించడం లేదు. అదేవిధంగా ఖాజీపేట, వరంగల్‌, నిజామాబాద్‌, డోర్నకల్‌, మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. వరంగల్‌, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో భాద్రతా ఏర్పాట్లను సీపీ తరుణ్‌ జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

రైల్వే స్టేషన్లలో పోలీసుల మోహరింపు

Sai Pallavi | Vijayashanthi : సాయి పల్లవిపై విజయశాంతి అనూహ్య స్పందన.. అలాంటి సమాజంలో ఉన్నాం..


సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిర్వహించిన ఆందోళనలతో దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్‌సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యువత పెద్దఎత్తున ఆందోళన చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.
Published by:Madhu Kota
First published:

Tags: Agnipath Protest, Agnipath Scheme, India Railways, Secunderabad railway station

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు