Home /News /telangana /

AGNIPATH PROTESTS SECUNDERABAD RAILWAY STATION VANDALISED AND A TRAIN SET ABLAZE BY AGITATORS WHO ARE PROTESTING AGAINST AGNIPATH RECRUITMENT SCHEME SK

Secunderabad Railway station: మంటల్లో కాలిపోతున్న రైళ్లు.. సికింద్రాబాద్ స్టేషన్‌లో భయానక దృశ్యాలు

తగలబడుతున్న రైళ్లు

తగలబడుతున్న రైళ్లు

Secunderabad Railway station: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్మీలో అగ్నిపథ్ నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యూఐ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మాారాయి. కొందరు ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు.

ఇంకా చదవండి ...
    ఆర్మీ నియామకాలకు సంబంధించి.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం (Agnipath Army Recruitment Scheme) అగ్గిరాజేస్తోంది.  అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించాయి. శుక్రవారం కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ (Secunderabad Railway Station)ను ముట్టడించారు. ఐతే కొందరు ఆందోళనకారులు స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.  ప్లాట్‌ఫారమ్‌లపై నిలిపి ఉన్న మూడు రైళ్లను తగులబెట్టారు. స్టేషన్‌లో ఉన్న పార్సిళ్లను పట్టాలపై వేసి నిప్పంటించారు. పలు రైళ్ల మంటల్లో తగలబడడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమ్యారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించి.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ (Secunderabad Violence)లో రైళ్లు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.















    అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడిస్తామని నిన్ననే NSUI ప్రకటించింది. ఆర్మీ అభ్యర్థులు ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఐనప్పటికీ స్టేషన్‌లో సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. రైళ్లకు నిప్పటించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొందరు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రైళ్లకు నిప్పు పెట్టడం, పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో.. స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా స్టేషన్‌లో కరెంట్ సరఫరా నిలిపివేశారు.  సికింద్రాబాద్‌లో హింసాత్మక ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agnipath Protest, Agnipath Scheme, Hyderabad, Secunderabad railway station, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు