Home /News /telangana /

AGNEEPATH SCHEME ROW PROTESTS IN HYDERABAD NSUI STUDENTS STORM SECUNDERABAD RAILWAY STATION SET FIRE MKS

Agneepath Row : హైదరాబాద్‌లో అగ్నిపథ్ నిప్పులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు నిప్పు..

సికింద్రాబాద్ స్టేషన్ లో పట్టాలకు నిప్పు

సికింద్రాబాద్ స్టేషన్ లో పట్టాలకు నిప్పు

అగ్నిపథ్‌ పథకంపై ఆందోళనలు హైదరాబాద్‌కు పాకాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.

సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్‌ పథకం (Agneepath Scheme Row) పై ఆందోళనలు హైదరాబాద్‌కు పాకాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ (Secunderabad Railway Station) వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.

నిరసనకారులు రైలు పట్టాలపై నిప్పుపెట్టారు. పలు రైళ్లనూ తగుల బెట్టారు. దట్టమైన పొగలు వ్యాపించి జనం ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది.. స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటికి పంపారు. ప్రస్తుతం స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.



అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతోన్న క్రమంలో హైదరాబాద్ లోనూ ఆందోళనలకు దిగింది కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ. స్టేషన్ బయట, లోపల కార్యకర్తలు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు.





ర్యాలీగా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. తొలుత స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ఫ్లాట్ ఫారాలపై నిలిచిఉన్న పలు రైళ్లకు నిప్పు పెట్టారు.


Sai Pallavi | Vijayashanthi : సాయి పల్లవిపై విజయశాంతి అనూహ్య స్పందన.. అలాంటి సమాజంలో ఉన్నాం..


నిజానికి తాము సికింద్రాబాద్ స్టేషన్ ను చుట్టుముడతామని కాంగ్రెస్ విద్యార్థి సంఘం గురువారమే ప్రకటించినా, అధికారులు భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో శుక్రవారం నాటి పరిస్థితి చేయిజారింది. కాగా, ఈ నిరసనల్లో కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో సంఘవిద్రోహశక్తులు ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబడుతోన్న దృశ్యాలు సంచలనంగా మారాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Agnipath Scheme, Congress, Secunderabad railway station

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు