Home /News /telangana /

AGITATION FOR REOPEN FOR CCI OF ADILABAD AT NATIONAL HIGHWAY VRY

Adilabad : మళ్ళీ మొదలైన సిసిఐ ఆందోళన.. పునరుద్దరణకు జాతీయ రహదారి దిగ్భంధం..

ఆందోళన చేస్తున్న నేతలు

ఆందోళన చేస్తున్న నేతలు

Adilabad : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే పున:ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో 44వ నెంబర్ జాతీయ రహదారిని దిగ్భందించారు.

    ( Lenin News 18 Telugu ,Adilabad )

    సిసిఐ పునరుద్దరణ కోసం గత కొన్ని రోజుల నుండి దశల వారీగా ఆందోళన కొనసాగిస్తున్న సిసిఐ సాధన సమితి ఈ రోజు జాతీయ రహదారి దిగ్భందనానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ పార్లమెంటు సభ్యుడు గొడం నగేష్ తోపాటు సిసిఐ సాధన సమితి సభ్యులు, టిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని పలుకాలనీలతోపాటు పొరుగున ఉన్న గ్రామాల నుండి ర్యాలీగా ఈ ఆందోళనకు కార్యకర్తలు తరలివచ్చారు.

    ఆదిలాబాద్ పట్టణ శివారులోని జందాపూర్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిని దిగ్భందించి అక్కడే మహా ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా జాతీయ రహదారికి ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్ల కార్డులను ప్రదర్శించారు. కళాకారులు ధూం ధాం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.  కార్యకర్తలు చేసిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.

    Bhadradri : ఇక్కడ పనిచేయలేమంటున్న అధికారులు... ఆ ఎమ్మెల్యే దెబ్బకు హడల్...!

    ఈ సందర్భంగా ఆదిలాబాద్ శాసన సభ్యుడు జోగు రామన్న మాట్లాడుతూ సిమెంటు పరిశ్రమను తెరిపించాలని ఆదిలాబాద్ లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని, బడ్జెట్ లో కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆదిలాబాద్ ప్రజలకు ఉపయోగపడే ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే లైన్ కు కూడా నిధులను కేటాయించలేదని పేర్కొన్నారు. సిమెంటు పరిశ్రమను తెరిపించాలని రాష్ట్ర మంత్రి కెటిఆర్ కేంద్రానికి లేఖ రాసినా కూడా మొండిచేయి చూపించిందని విమర్శించారు. ఈ పరిశ్రమను ప్రారంభిస్తే స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పరిశ్రమ ఏర్పటుతో భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

    Love story : ఈమె మాములు లవర్ కాదు.. పెళ్లైన మరునాడే, భర్తను రోడ్డుపై పెట్టి టాయ్‌లెట్‌కు వెళ్లింది..తీరా..

    ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ లోని సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని డిమాండి చేశారు. ఆదిలాబాద్ అభివృద్దిపై స్థానిక ఎం.పి కి చిత్తశుద్ది ఉంటే సిమెంట్ పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సిసిఐని పున: ప్రారంభించేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు