Home /News /telangana /

AFTER YADADRI CM KCR FOCUS ON VEMULAWADA TO VISIT SRINGERI SHARADA PEETHAM AMID DIFFERENCES WITH CHINNA JEEYAR MKS

CM KCR | Chinna Jeeyar : చిన జీయర్‌తో విభేదాలు..కేసీఆర్ కొత్త గురువు ఎవరంటే.. సంచలన అడుగులు

కేసీఆర్, భారతి తీర్థ, చిన జీయర్

కేసీఆర్, భారతి తీర్థ, చిన జీయర్

త్రిదండి పీఠాధిపతి చిన జీయర్ స్వామితో విభేదాల కారణంగా సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త గురువు పర్యవేక్షణలో శైవాలయాల ఉద్దరణకు దిగబోతున్నారు. పాత విరోధులనూ దగ్గరకు తీస్తున్నారు. పాత పేర్లను ప్రస్తావిస్తున్నారు. వివరాలివే..

చరిత్ర పొడవునా శివారాధక ప్రాంతంగా, నాటి రాజులూ శివ భక్తులుగా, ఇప్పటికీ శైవ ఫిలాసఫీని పుణికిపుచ్చుకున్న నేలగా తెలంగాణను చరిత్రకారులు అభివర్ణిస్తారు. అలాంటి గడ్డపై వైష్ణవాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ ఇక శైవాన్ని కూడా తలకెత్తుకోనున్నట్లు సంకేతాలిచ్చారు. వైష్ణవాలయం యాదాద్రిని ఎంతైతే అద్భుతంగా పునరుద్దరించారో శైవక్షేత్రమైన వేములవాడనూ అదే స్థాయిలో అభివృద్ది చేయాలని సంకల్పించారు. కాగా, త్రిదండి పీఠాధిపతి చిన జీయర్ స్వామితో విభేదాల కారణంగా సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త గురువు పర్యవేక్షణలో శైవాలయాల ఉద్దరణకు దిగబోతున్నారు. ఆలయాల అభివృద్ది, మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇకపై శృంగేరి శారద పీఠం అధిపతి భారతీ తీర్థ స్వామినే అనుసరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ సొంత మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలోనూ కేసీఆర్ సంచలన అడుగులు వేస్తున్నారంటూ కామెంట్లు వస్తున్నాయి..

ఏపీలో తిరుమల మాదిరిగా తెలంగాణలో అతిపెద్ద వైష్ణక్షేత్రంగా యాదగిరిగుట్టను మలచాలనుకున్న సీఎం కేసీఆర్ ఆరేళ్ల కిందట చిన జీయర్ స్వామిని వెంటేసుకొని హెలికాప్టర్ లో గుట్టను చుట్టిరావడం, ఆనాడే ఆ ప్రాంతాన్ని యాదగిరి గుట్ట కాకుండా యాదాద్రిగా జీయర్ స్వామి పున:నామకరణం చేయడం, ఇన్నేళ్లలో అనేక అవాంతరాలను అధిగమిస్తూ, కఠోర శ్రమతో మొత్తానికి ఆలయం పూర్తికావడం, అదే సమయానికి చినజీయర్ ముచ్చింతల్ లోని తన ఆశ్రమంలో రామానుజాచార్యుడి సమతామూర్తిని కూడా నిర్మించడం తెలిసిందే. అయితే సమతామూర్తి ప్రారంభోత్సవం సందర్భంలో కేసీఆర్, చినజీయర్ ల మధ్య విభేదాలు తలెత్తడం, ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టడం, ఆ తర్వాత యాదాద్రి పున:ప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించలేదనో, విభేదాల కారణంగానో చిన జీయర్ తాను పేరుపెట్టిన యాదాద్రి వైపు తిరిగి చూడకపోవడం లాంటి పరిణామాలు జరిగాయి.

KCR | Chinna Jeeyar: సమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు.. టికెట్ విషయంలో తగ్గేదేలేదు!


యాదాద్రి మళ్లీ యాదగిరి గుట్ట?
చిన జీయర్ తో ఎక్కువ సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం ద్వారా కేసీఆర్ వైష్ణవానికే అనుకూలం అనే ముద్ర పడిందని, ఇప్పుడు దాన్ని చెరిపేసుకోడాకే శైవాలయాల ఉద్ధరణకు సీఎం పూనుకున్నారని, చిన జీయర్ ను పక్కన పెట్టేసి శృంగేరి పీఠాధిపతితో కలిసి నడవబోతున్నట్లు సంకేతాలిచ్చారు. చినజీయర్ యాదగిరి గుట్టకు యాదాద్రి అని పేరుపెట్టిన క్రమంలో గడిచిన ఆరేళ్లూ ప్రభుత్వం, టీఆర్ఎస్ అనుకూల మీడియా ఆ ఊరి పేరును యాద్రిగా మాత్రమే రాసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ యాదాద్రిని యాదగిరిగుట్టగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. జీయర్ పెట్టిన యాదాద్రి కాకుండా సామాన్య జనం పిలుచుకునే యాదగిరిగుట్టగానే కొత్త ఆలయాన్ని వ్యవహరించేలా త్వరలో ఉత్తర్వులు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

PM Kisan: రైతులకు శుభవార్త : బ్యాంకు ఖాతాల్లోకి రూ.2000 -ఎల్లుండే జాబితా.. మీ పేరుందా?


త్వరలోనే శృంగేరీ పీఠానికి సీఎం..
నిజానికి కేసీఆర్ శృంగేరీ పీఠానికి వెళ్లడం కొత్తేమీ కాదు, గతంలోనూ సతీసమేతంగా పలు మార్లు వెళ్లొచ్చారు. అయితే, చిన జీయర్ తో విభేదాల క్రమంలో ఈసారి సీఎం శృంగేరీ సందర్శనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో సీఎం కేసీఆర్ కర్ణాటక వెళ్లి శృంగేరీ శారద పీఠాధిపతి భారతీ తీర్థ స్వామిని కలవనున్నారు. ఆలోపే ఒకసారి వేములవాడ ఆలయాన్ని సందర్శించి, రాజరాజేశ్వరస్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సం బంధించి సమీక్షలు జరుపనున్నారు. అభివృద్ది చేయబోయే ఆలయం వెయ్యేళ్ల అవసరాలు తీర్చేలా ఉండేలా డిజైన్లు, ఆగమ, వాస్తు శాస్త్ర నిపుణు లు, శిల్పులు అందజేసిన నివేదికలతో వీటీడీఏ అధికారులు ప్రతిపాదనలు, డిజైన్లు సిద్ధం చేయించి, తరువాత శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామివారిని కలిసి కేసీఆర్ చర్చలు జరుపనున్నారు. మరో సంచలన విషయం ఏంటంటే..

CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!


పాత విరోధులను దగ్గరకు తీస్తూ..
‘కేసీఆర్ పగబడితే మామూలుగా ఉండదు.. అవతలివాడు అంతు చూసేదాకా ఊరుకోడి..’అని ఒకప్పటి సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పలు సందర్భాల్లో సీఎం తీరు గురించి చెబుతారు. రాజకీయ నేత కాకున్నా ఒకప్పటి కేసీఆర్ సన్నిహితుడు, పారిశ్రామికవేత్త, నమస్తే తెలంగాణ పత్రిక తొలి యజమాని సీఎల్ రాజంను గులాబీ బాస్ తిరిగి దగ్గరకు తీసుకున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు కేసీఆర్ సీఎల్ రాజంకే అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట నమస్తే తెలంగాణ పత్రికను కేసీఆర్ తిరిగి హస్తగతం చేసుకున్న సందర్భంలో గులాబీ బాస్ తీరుకు నొచ్చుకున్న సీఎల్ రాజం నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరడం తెలిసిందే. అలాంటి రాజం మళ్లీ నిన్న యాదాద్రిలో సీఎంకు సన్నిహితంగా కనిపించడం హాట్ టాపిక్ అయింది. వేములవాడ రాజన్న ఆలయ పున:ప్రతిష్టలో సీఎల్ రాజంకు కేసీఆర్ ముఖ్యపాత్ర ఇవ్వబోతున్నట్లు వెల్లడవుతోంది.

KCR దూకుడుకు అమిత్ షా కళ్లెం! -ఢిల్లీ నుంచే మిషన్ తెలంగాణ ఆపరేషన్ -రంగంలోకి ఆ 26 మంది?


యాదాద్రికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, దాదాపు రూ.2,000 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆ బడ్జెట్ కు ఏమాత్రం తగ్గకుండానే వేములవాడ రాజరాజేశ్వరాలయాన్ని సర్వాంగసుదరంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. వేములవాడతోపాటు చుట్టుపక్కల ఉన్న కొండగట్టు అంజన్న ఆలయాన్నీ అభివృద్ది చేయాలని కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ చేపట్టబోయే ఆథ్యాత్మికపరమైన కార్యక్రమాలన్నీ చిన జీయర్ కాకుండా శృంగేరి పీఠాధిపతుల నేతృత్వంలో సాగనున్నాయి..
Published by:Madhu Kota
First published:

Tags: Chinna Jeeyar Swamy, CM KCR, Telangana, Vemulawada, Yadadri temple

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు