AFTER PLAYING WITH SNAKE HE HOSPITALISED IN HYDERABAD VRY
Snake kiss : పామును ముద్దాడితే ఊరుకుంటుందా...? రివర్స్ అయిన స్నేక్ కిస్.. చివరకు ఇలా..
పాముకు కిస్ చేస్తున్న ఆకాశ్
Snake kiss : విషసర్పంతో గేమ్స్ ఆడిన యువకుడి ఓ ఫోటో మంగళవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే ఆ యువకుడి చేసిన హల్ చల్‌తో చివరకు ఆసుపత్రి పాలయ్యాడు..
ఒక్కోసారి కొంతమంది చేసే విన్యాసాలు, సాహసం , వారికే రివర్స్ గా మారతాయి..అలా ఒక్కోసారి ప్రాణపాయం మీదకు కూడా తెచ్చుకుంటారు.ఇలా ఓ వ్యక్తి చేసిన సాహసం ఆయన్ను ఆసుపత్రి పాలయ్యాడు.. మహారాష్ట్రాకు చెందిన ఆకాశ్ తన కుటుబంతో వలస వచ్చి నగరంలోని గాజుల రామారంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో నివాసముంటు స్థానికంగా ఉండే క్వారీలో రాళ్లు కొడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి వారు ఉండే ప్రాంతానికి ఓ విష సర్పం వచ్చింది. అయితే పాములు పట్టడడంలో ఆకాశ్ కు ప్రావీణ్యం ఉండడంతో స్థానికులు ఆకాశ్‌కు సమాచారం అందించారు. దీంతో స్పాట్‌కు చేరుకుని పామును పట్టకున్నాడు.. దీంతో హీరోలా మారాడు.
ఆ తర్వాత జనాలు అందరు చూస్తుండగానే విషపు పాముతో విన్యాసాలు చేశాడు. పామును ముద్దాడుతూ.. ఫోటోలకు సెల్ కెమెరాలకు ఫోజులిచ్చాడు. అయితే పామును ముద్దాడుతున్న సమయంలో దాని విషం నోట్లోకి వెళ్లిందా లేదంటే కాటు వేసిందో తెలియదు కాని.. ఇది గమనించని ఆకాశ్ దాంతో విన్యాసాలు చేసిన అనంతంర దూరంగా వదిలిపెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని సమీపంలోని ఓ ప్రవైటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆకాశ్ ప్రాణాపాయ స్థితి నుండి కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.