Lover suicide : మరదలిని ప్రేమించినందుకు బెదిరించిన మేనత్త, మామ.. సెల్ఫీ వీడియోతో యువకుడు దారుణం

Lover suicide : మరదలిని ప్రేమించడం ఆ యువకుడికి శాపం అయింది.. దీంతో ఆయువతి తల్లిదండ్రులు మేనల్లున్ని బెదిరించారు. ప్రేమ పేరుతో ఇంటికి వస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన తాండూరు మండలం గుంతబాస్పల్లిలో చోటుచేసుకుంది.

Lover suicide : మరదలిని ప్రేమించడం ఆ యువకుడికి శాపం అయింది.. దీంతో ఆయువతి తల్లిదండ్రులు మేనల్లున్ని బెదిరించారు. ప్రేమ పేరుతో ఇంటికి వస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన తాండూరు మండలం గుంతబాస్పల్లిలో చోటుచేసుకుంది.

 • Share this:
  వివరాల ప్రకారం..గుంతబాస్పల్లి గ్రామానికి చెందిన సందప్ప కర్ణాటక సరిహద్దు సిమెంటు కర్మాగారంలో కీమెన్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య దస్తమ్మ కూలీ. వీరికి ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు సంతోష్‌ యాదవ్‌ పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసముండే మేనత్త దేవమ్మ కూతురును ప్రేమించాడు. ఈ విషయం ఇష్టం లేకపోవడంతో దేవమ్మ ఆమె భర్తతో కలిసి సంతోష్‌ను బెదిరించింది. కూతురుని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయవద్దని హెచ్చరించింది. అయినా సంతోష్ వినకపోవడంతో రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని ఠాణాకు రప్పించిన పోలీసులు యువతి జోలికి వెళ్ల వద్దంటూ యువకుడికి ఈనెల 24న కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

  అనంతరం రెండు రోజులుగా మేనత్త, మేనమామ శేఖర్‌లు యువకునికి తరచూ ఫోన్‌ చేసి చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు నిన్న తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి కొన్ని నిమిషాల ముందు బలవణ్మరణానికి పాల్పడిన ఆ యువకుడు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో ను తన వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు పంపించాడు.ఆ వీడియోను చూసిన స్నేహితులు, గ్రామస్థులంతా ఒక్కసారిగా పొలం వద్దకు చేరుకొని గాలించారు.

  ఇది చదవండి : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కొత్త పార్టీ -సిక్కును సిక్కుతోనే అడ్డుకొనేలా బీజేపీ బంపర్ ప్లాన్! -కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?


  అప్పటికే చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి దిగ్బ్రాంతికి లోనయ్యారు.. చేట్టుకు వేలాడుతూ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ సత్తయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేక్రమంలో మృతుని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. వేధింపులకు పాల్పడ్డ శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా కుటుంబ సభ్యులు, బంధువులు వెంబడించి కొట్టేందుకు యత్నించారు. ఎస్‌ఐ ఏడుకొండలు అధ్వర్యంలో పోలీసు సిబ్బంది వారించారు. నిందితున్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్‌ఐ వారందరికీ సర్దిచెప్పి నిందితుడిని పోలీసు జీపులో గౌతాపూర్‌ ఠాణాకు తరలించారు. అందరితో కలిసి ఉండే సంతోష్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి.

  ఇది చదవండి : Love attack : ప్రేమించడం లేదని యువతి ఇంటినే తగులబెట్టాడు..


  కొంతమంది యువకులు ప్రేమించిన వారిని దక్కించుకోవడం కోసం దాడులకు పాల్పడుతుంటే సంతోష్ మాత్రం తన ప్రాణాన్ని తీసుకుని బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు బాధను మిగిల్చాడని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.
  Published by:yveerash yveerash
  First published: