Home /News /telangana /

AFTER KEY POSTINGS TO SC NOW TELANGANA CM KCR FOCUS ON BCS TO EYE ON HUZURABAD BY ELECTIONS BA

పోస్టింగ్‌ల్లో రూట్ మార్చిన కేసీఆర్.. కీలక స్థానాల్లో ఎస్సీల తర్వాత బీసీల వైపు చూపు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణలో దళిత సామాజికవర్గానికి చెందిన అధికారులను సడన్‌గా ఉన్నత స్థానాలకు బదిలీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే, హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీల తర్వాత బీసీ ఉద్యోగులకు కూడా కీలక పోస్టింగుల్లో ప్రాధాన్యం కల్పించనున్నారా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K.Chandrasekhar Rao) ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు?... ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ కూర్చోబెడతారు?.. కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనుక మతలబేంటి?.. అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ప్రత్యర్థుల ఊహలకు కూడా అందనంత వేగంగా ఉంటాయి. ఇక ఇటీవల కీలక స్థానాల్లో పోస్టింగ్ ల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మార్క్ చూపిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో అత్యంత కీలకమైన విభాగం సీఎంవో ఆఫీస్.. ప్రత్యక్షంగా కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసే ఈ కార్యాలయంలో ఇప్పటివరకూ బ్రాహ్మణులు ఇతర అగ్రవర్ణాల వారికి మాత్రమే చోటు ఉంటుంది అన్న అపవాదు ఉండేది. వాస్తవానికి అది నిజమే. సీఎం కేసీఆర్ ముఖ్య కార్యాలయంలోని కీలక పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తక్కువ మంది ఉండేవారు. ఇలా ఇప్పటి వరకు కేవలం ఒక సామాజిక వర్గానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఇటీవల కాలంలో అనూహ్యంగా తన రూటు మార్చారు.

  హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad Bypolls) అనివార్యమైన పరిస్థితుల్లో కొన్ని కీలక పోస్టింగులలో వేగం పెంచారు. దళితుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు (Dalita Bandhu) కార్యక్రమం ప్రకటన తర్వాత ఒక మీటింగ్ లోనే సీఎం కేసీఆర్, తన కార్యాలయంలో కీలక బాధ్యతలను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జను నియమిస్తున్నట్టుగా ప్రకటించారు.

  Telangana Dalit Bandhu: లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ.. క్రెడిట్ కాని వారికి..  రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో అత్యంత కీలక స్థానమైన ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ గా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అనిల్ కుమార్ ను నియమించారు. వాస్తవానికి ఈ స్థానంలో అప్పటి వరకూ తన సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ రావును ఐజి ఇంటెలిజెన్స్ గా పెట్టుకున్నారు. రాజకీయ ప్రత్యర్ధులు ప్రభాకర్ రావు గురించి పలుమార్లు విమర్శలు చేసినా సీఏం కేసీఆర్ పట్టించుకోలేదు. సదరు అధికారి రిటైర్ అయిన తర్వాత కూడా అదే కీలక స్థానంలో కొనసాగించారు.

  Huzurabad : అక్కడ ప్రతిరోజు పండగే.. 100 కోట్ల మద్యం జాతర.. కారణం ఇదే..!  ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండ్ మార్చిన సీఎం కేసీఆర్.. అనూహ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అనిల్ కుమార్ కు ఈ పదవి కట్టబెట్టారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మరో సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో వెస్ట్ జోన్ ఐజీ గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రకు అత్యంత కీలకమైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారన్న వాదన ఉన్నప్పటికీ స్టీఫెన్ రవీంద్ర కు ఉన్నత స్థానం దక్కింది. అందుకు ఏకైక కారణం స్టీఫెన్ రవీంద్ర కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం అన్న చర్చ బయట సాగుతోంది.

  ఎస్సీల తర్వాత బీసీల వైపు కేసీఆర్ చూపు

  ఇది కొంత అసందర్భంగా తోచినప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నిక కోణంలో ఆలోచించినట్లయితే.. ఆ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీల ఓట్లు ఉన్నాయి.. ఓవైపు దళిత బందు ఇస్తూనే మరోవైపు దళిత అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు తనపై ఉన్న దళిత వ్యతిరేకి, దళిత అధికారులను దూరం పెడతారు అన్న అపవాదు ను దూరం చేసుకున్నట్లు అయింది. అదేవిధంగా ఎస్సీ ఓటర్లు సైతం పాజిటివ్ యాంగిల్ లో ఆలోచించేలా తనవైపు మూడ్ ను మార్చుకోవడం లో ఒక ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు.

  గౌడ సామాజికవర్గం ఓట్లపై కేసీఆర్ ఫోకస్

  ఇక అదే హుజురాబాద్ లో ఎస్సీ సామాజిక వర్గం తర్వాత బీసీ ఓట్లు అందులో గౌడ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువే. ఇప్పుడు జైళ్ల శాఖ లోనూ అత్యంత కీలకమైన పదవులకు సంబంధించిన అంశం సీఎం కేసీఆర్ వద్ద పెండింగ్లో ఉంది. తెలంగాణ జైళ్ల శాఖ లో అత్యంత కీలకమైన చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ పోస్టు మరో వారంలో ఖాళీ కాబోతోంది. దీనికి ప్రధానంగా ముగ్గురు అధికారులు పోటీపడుతున్నారు. వీరిలో శివకుమార్ గౌడ్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన అధికారి కాగా.. మిగిలిన ఇద్దరు తెలంగాణ బయటి వ్యక్తులు. ఈ ఇద్దరిలో ఒకరు కళాసాగర్ అనంతపురం జిల్లాకు చెందిన వారు. మరొకరు సంతోష్ రాయ్ నార్త్ ఇండియాకు చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గం వారు.

  మాజీమంత్రికి కేసీఆర్ కీలక పదవి.. సమీక్షలో సీఎం పక్కనే సీటు.. దళితబంధులో ఆయనే కీలకం కాబోతున్నారా ?


  హుజురాబాద్ ఉప ఎన్నిక కోణంలో చూసినట్లయితే.. ఇప్పటికే ముగ్గురు ఎస్సీ వర్గానికి చెందిన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ స్థానికుడు.. హుజురాబాద్ ఉప ఎన్నికలు అత్యంత కీలకమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన అధికారి శివ కుమార్ గౌడ్ కి అత్యంత కీలకమైన చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ గా అవకాశం కల్పిస్తారా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై ఇప్పుడు జైళ్ల శాఖ అధికారిక వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: CM KCR, Huzurabad By-election 2021, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు