హోమ్ /వార్తలు /తెలంగాణ /

Governor meets with Amith Shah: అమిత్​షాతో ముగిసిన గవర్నర్​ భేటీ.. సీఎం కేసీఆర్​ ప్రభుత్వంపై  తమిళిసై సంచలన ఆరోపణలు.. 

Governor meets with Amith Shah: అమిత్​షాతో ముగిసిన గవర్నర్​ భేటీ.. సీఎం కేసీఆర్​ ప్రభుత్వంపై  తమిళిసై సంచలన ఆరోపణలు.. 

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో మీటింగ్​ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో మీటింగ్​ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో మీటింగ్​ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

  తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రొటోకాల్ (Protocal) పాటించడం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ మంచి పనుల్ని తాను అభినందించానని, పలు సూచనలు చేశానని చెప్పారు. గురువారం తెలంగాణ గవర్నర్‌ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra modi)తో భేటీ అయిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Home minister Amit shah)ను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలతో అమిత్ షాతో చర్చించానని చెప్పారు. అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేనని అన్నారు.

  సమస్య ఉంటే రాజ్​భవన్​ రావొచ్చు..

  ఈ సందర్భంగా గవర్నర్​ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని తెలిపారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో తమిళిసై అన్నారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు. మేడారంకు రోడ్డు మార్గంలోనే వెళ్లానని చెప్పారు. భద్రాచలంకు కూడా రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లనున్నట్టుగా తెలిపారు.

  తెలంగాణలో ఎవరూ తన ప్రయాణాన్ని ఆపలేరని తమిళిసై అన్నారు. మేడారంకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని తాను చెప్పలేదని.. సీతక్క చెప్పారని అన్నారు. యదాద్రిలో తనకు మర్యాద ఇవ్వలేదని మీడియా రాసిందని.. తాను అనలేదని గవర్నర్​ తెలిపారు. సీఎం, మంత్రులు, సీఎస్.. రాజ్‌భన్‌కు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. తనతో సమస్య ఉంటే ఎవరైనా వచ్చి చర్చించవచ్చు అని తమిళిసై చెప్పారు.

  బీజేపీ వ్యక్తిగా వెళ్లానని ఎలా చెప్పగలరు..?

  యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నట్టుగా చెప్పారు గవర్నర్​. యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనను కలవలేదని చెప్పారు. యాదాద్రికి తాను బీజేపీ వ్యక్తిగా వెళ్లానని వాళ్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను బీజేపీ నాయకులను కేవలం ఒకటి, రెండుసార్లే కలిశానని తెలిపారు. తమిళిసైని కాకపోయినా రాజ్‌భన్‌ను గౌరవించాలన్నారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని చెప్పారు. తెలంగాణలో రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో ఏం జరుగుతుందో మాత్రమే చెబుతున్నానని అన్నారు.

  “రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ, నన్ను బీజేపీ నేత అని ఎలా అనగల్గుతున్నారని ప్రశ్నించారు.అన్ని పార్టీల నేతలను కలిశాను. ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతలను ఒకట్రెండుసార్లు మాత్రమే కలిశానన్నారు. ఏదన్నా ఉంటే నేరుగా అడగండి, నేను సమాధానం చెబుతాను. అలాగే సీఎస్, డీజీపీ, ఇతర అధికారులను వచ్చి వివరణ ఇవ్వమనండి” అంటూ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర వేడుకలకు, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు..ఇదేనా మర్యాద? సీఎం సహా అందరినీ ఆహ్వానించానని గవర్నర్ స్పష్టం చేశారు.

  రాజ్‌భవన్‌కు, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని అన్నారు. ఉగాది వేడుకలకు తాను ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని చెప్పారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదన్నారు. రిపబ్లిక్ డే, ఉగాది కార్యక్రమాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఒక మహిళకు గౌరవం ఇవ్వాల్సిన విధానం ఇది కాదని అన్నారు. సోదరిగా భావిస్తే ఇలాగే వ్యవహరిస్తారా అని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు.

  First published:

  Tags: Amit Shah, CM KCR, Governor Tamilisai Soundararajan, Telangana Government

  ఉత్తమ కథలు