AFTER 45 DAYS IT FIRMS TO BE OPENED FROM TODAY IN HYDERABAD BS
ఐటీ కంపెనీలకు పోలీసుల పర్మిషన్.. నేటి నుంచి ఓపెన్..
ప్రతీకాత్మక చిత్రం
దాదాపు 45 రోజుల తర్వాత ఐటీ కంపెనీలు నేడు పున:ప్రారంభం కానున్నాయి. 33 శాతం వర్క్ ఫోర్స్‌తో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.
దాదాపు 45 రోజుల తర్వాత ఐటీ కంపెనీలు నేడు పున:ప్రారంభం కానున్నాయి. 33 శాతం వర్క్ ఫోర్స్‌తో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అన్ని షిఫ్ట్‌ల్లో 33 శాతం వర్క్ ఫోర్స్ మాత్రమే ఉండాలని, ఉద్యోగులు ఉదయం 7 గంటలకు, 10 గంటలకు లాగిన్ అయితే, సాయంత్రం 3 గంటలు, 6 గంటల కల్లా లాగౌట్ కావాలని సూచించారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌తో ఇండస్ట్రీ బాడీలు ఏఎస్‌సీఎస్‌సీ, హైసియా, నాస్కామ్, ఐటీ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఐటీ సెక్టార్‌కు గైడ్‌లైన్స్ ను జారీ చేశారు. ఉద్యోగులకు, క్యాబ్‌లకు ఇచ్చే అథరైజేషన్ లెటర్లను కేవలం ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి మాత్రమే వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి కంపెనీ ఐడీ కార్డుతో పాటు అథారిటీ లెటర్‌ను కూడా క్యారీ చేయాలని చెప్పారు.
కచ్చితంగా మాస్క్ ధరించాలని, శానిటైజర్, హ్యాండ్ వాష్ వినియోగించాలని ఐటీ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు పోలీసులు. క్యాబ్‌లలో డ్రైవర్ కాకుండా ఇద్దరు, బస్సుల్లో 50 శాతం మందికే అనుమతి ఉంటుందని తెలిపారు. ఆఫీసుల్లోని క్యాంటీన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఐటీ కంపెనీలకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.