హైదరాబాద్‌లో కుండపోత వర్షం... 111 ఏళ్ల తర్వాత కుంభవృష్టి

1908లో సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది.

news18-telugu
Updated: September 25, 2019, 7:37 AM IST
హైదరాబాద్‌లో కుండపోత వర్షం... 111 ఏళ్ల తర్వాత కుంభవృష్టి
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయమయ్యాయి.
  • Share this:
హైదరాబాద్‌ను మంగళవారం సాయంత్రం నుంచి వర్షం కుమ్మేస్తోంది. నిన్నసాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లేవాళ్లకు చుక్కలు కనిపించాయి. వాన ఎప్పటికీ తగ్గకపోవడంతో చాలామంది తడుస్తూనే... ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గత వందేళ్లలో ఏనాడు ఈ విధంగా వర్షం పడలేదు. దాదాపు 111 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌లో ఈ విధంగా కుండపోత వర్షం కురిసింది.1908 సెప్టెంబరు తర్వాత ఈస్థాయిలో వాన కురవడం ఇదే తొలిసారి.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నాలాలు, చెరువులు పొంగిపోర్లాయి. రోడ్లపై మోకాళ్ల నీతు చేరింది. దీంతో వాహనదారులకు కూడా తిప్పలు తప్పలేదు. . రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్‌లో 12 సెం.మీల వర్షం కురిసింది.  1908లో సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 24న ఆ స్థాయిలో వర్షం కురిసిందని భాగ్యనగర వాసులు చర్చించుకుంటున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 25, 2019, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading