ADVOCATE CHEAT A WOMAN WHO CAME TO JUSTICE FOR DIVORCE IN HYDERABAD VRY
Hyderabad : విడాకుల కేసు వాదించమంటే ఆమెపై కన్నెశాడు ఓ అడ్వకేట్.. ఆ తర్వాత..
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad : భర్త నుండి దూరంగా ఉంటున్న ఓ మహిళ అడ్వకేట్ వద్దకు వెళితే ఆమెను లోబరుచుకునేందుకు ఆ లాయర్ పక్కా స్కెచ్ వేశాడు.. మంచిగా మాట్లాడి నమ్మించాడు.. ఇల్లు చూపించి సీక్రెట్‌గా సీసీ కెమెరాలు పెట్టాడు.
నగరంలో నివాసం ఉండే ఓ వివాహితురాలు తన భర్తతో ఘర్షణ చెలరేగడంతో ఆయన నుండి దూరంగా ఉండి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే భర్తనుండి విడాకులు ఇప్పించేందుకు ఓ అడ్వకేట్ సహాయం తీసుకొవాలని నిర్ణయించి, ఓ లాయర్‌ను సంప్రదించింది. అయితే ఇక్కడే లాయర్ కూడా తన వృత్తిని మరిచాడు. చట్టపరమైన సహాయం కోసం వచ్చిన ఆ మహిళపై కన్నెశాడు. అప్పటికే భర్తనుండి దూరంగా ఉండడంతో ఆమె లాయర్ మాటలు నమ్మింది. తనకు ఓదార్పు మాటలు చెప్పడంతో అన్ని విషయాలు చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైన లోబరుచుకోవాలని ప్లాన్ వేశాడు. కాని బెడిసి కొట్టడడంతో కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. మల్కజ్గిరి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే..మహిళ(25)కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. అమె ఓప్రైవేట్ కంపనీలో ఉద్యోగం కూడా చేస్తోంది..కాగా భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు గతేడాది జూన్‌లో స్థానికంగా ఉండే లాయర్‌ను కలిసింది. విషయాలు చెప్పిన తర్వాత లాయర్ బుద్ది మారింది. ఆమెకు పలు మాయమాటలు చెబుతూ తన కార్యాలయానికి రప్పించుకున్నాడు.. ఆ తర్వాత ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇక భర్త నుండి దూరంగా ఉండాలని భావించిన ఆమె ప్రస్తుతం ఉన్న ఇంటి మరో ఇంటికి మారాలని నిర్ణయించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అడ్వకేట్ తాను నివసించే ప్రాంతంలోనే ఒక ఫ్లాట్ బాగుందని చెప్పి.. అందులోకి వచ్చేలా చేశాడు.. ఇక ఇక్కడే తన వంకర బుద్దిని చూపించాడు.. తానోక ప్రోఫెషనల్ వృత్తిలో ఉన్నాననే విషయం మరిచి పోయాడు..
ప్లాట్‌లో బాధితురాలికి తెలియకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే సమయంలో వీడియోలు షూట్ చేశాడు. ఆ తర్వాత వీడియోలను బాధితురాలికి చూపించి.. బెదిరించి శారీరకంగా లోబరుచుకున్నాడు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన ఆమె వాడి నుండి తప్పించుకోకుండా చేశాడు.
ఇలా అవసరం వచ్చినప్పుడల్లా .. లైంగిక వాంఛను తీర్చుకునే ప్రయత్నం చేశాడు.. ఇలా ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నా వదల్లేదు.. అతడి వేధింపులు రోజురోజుకు మరింత పెరుగుతూ ఉండటంతో.. విసిగి పోయిన బాధితురాలు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.