హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌లో మరోసారి కల్తీ కల్లు కలకలం.. పోలీసుల దాడులు..

Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌లో మరోసారి కల్తీ కల్లు కలకలం.. పోలీసుల దాడులు..

Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ కల్తీకల్లు కోరలు చాస్తోంది . కాసుల కక్కుర్తియే ఆసరాగా కొందరు అక్రమార్కులు తయారుచేస్తున్న మత్తు మాయతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది .

Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ కల్తీకల్లు కోరలు చాస్తోంది . కాసుల కక్కుర్తియే ఆసరాగా కొందరు అక్రమార్కులు తయారుచేస్తున్న మత్తు మాయతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది .

Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ కల్తీకల్లు కోరలు చాస్తోంది . కాసుల కక్కుర్తియే ఆసరాగా కొందరు అక్రమార్కులు తయారుచేస్తున్న మత్తు మాయతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది .

  కరీంనగర్ జిల్లాకేంద్రంలోని బైపాస్ మార్గంలో రహస్యంగా కృత్రిమ కల్లును తయారు చేస్తున్న తీరుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు . అందులో వినియోగించే మత్తు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు . బాధ్యులను అదుపులోకి తీసుకోవడంతోపాటు రూ .20 వేల విలువ చేసే 672 సీసాల కృత్రిమ కల్లును , వాటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు . అయితే గడిచిన కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెట్టు ద్వారా సేకరించిన కల్లునే పలుచోట్ల విక్రయిస్తుండగా .. అసలును కాదని నకిలీ మకిలీని అంటించేందుకు పలువురు ఇలా దొంగ వ్యాపారానికి తెరతీస్తున్నారు . గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం బట్టబయలు చేసే విషయంలో నాలుగు జిల్లాలోని ఆబ్కారీ అధికారులు ఒకింత చూసీచూడనట్లు ఉంటున్నారనే విమర్శలున్నాయి . పైకి మాత్రం అసలు కల్తీ మూలాలే ఏ ఒక్క చోట లేవని అధికారులు చెబుతున్నా .. లోలోపల మాత్రం చాపకింద నీరులా పలు ప్రాంతాల్లో ఈ తరహా సీసాలను పలువురికి విక్రయిస్తున్నారు .

  ముఖ్యంగా గోదావరిఖని , జగిత్యాల , సిరిసిల్ల పట్టణాల్లో కొన్నిచోట్ల వీటి సరఫరా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి . ఆయా సర్కిళ్ల పరిధిలో అడపాదడపా తనిఖీలు చేస్తే అక్రమంగా కల్తీ చేసే తీరుని బయటపడే వీలుంటుంది . చెట్టు నుంచి వచ్చిన కల్లు ఆరోగ్యపరంగా మేలు చేసేదనే ఉద్దేశంతో ప్రభుత్వం గీత కార్మిక వృత్తికి కుటీర పరిశ్రమ హోదా ఇచ్చింది . ఇందుకోసం రెండు రకాల అనుమతుల్ని జారీ చేసింది . అందులో మొదటిది టీఎఫ్ఎ ( ట్రీ ఫర్ ట్యాపర్ ) . అంటే గీత కార్మికుడు సొంతంగా కల్లుగీసి విక్రయించుకోవచ్చు . మరొకటి టీసీఎస్ ( కల్లు సహకార సంఘం ) విధానం . దీని ద్వారా కార్మికులంతా సొసైటీగా ఏర్పాటై కల్లు అమ్మకాలు జరపాలి . లాభనష్టాలను వారే భరించాలి .

  ఇలా కరీంనగర్ ఒక్క జిల్లాలోనే 187 సొసైటీలు , మరో 28 టీఎఫ్ఎ లైసెన్స్లు పొందిన వారున్నారు . ఇక నాలుగు జిల్లాల పరిధిలో రెండు రకాల ధ్రువీకరణలు పొందిన వారి సంఖ్య దాదాపుగా 500 కు పైగానే ఉంటుంది . వీరు కాకుండా కొందరు దురుద్దేశంతో కల్తీని తయారు చేస్తూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు . దొంగచాటుగా దందాను సాగిస్తున్నారు . వీరి ఆటను కట్టిస్తే గీతకార్మికుల వ్యాపారానికి మేలు జరిగే వీలుంది .

  TSRTC : బస్‌పాస్ ప్రయాణికులకు షాక్.. పెరిగిన చార్జీలు.. ఎప్పటి నుండి అంటే...

  వాస్తవానికి చెట్టు నుంచి సేకరించిన కల్లును మాత్రమే అమ్మాలి . కొందరు నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రదేశాల్లో రహస్యంగా మత్తును అందించే కల్తీ కల్లును తయారు చేస్తున్నారు . దీన్ని తాగిన పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు . డైజోఫాం , ఆల్పోజామ్ , క్లోరల్ హైడ్రేట్ , క్లోరోఫాం ( మత్తుకోసం ) , శక్రీన్ ( రుచికోసం ) , తెల్లపౌడర్ ( చిక్కదనం కోసం ) కుంకుడు కాయలు ( నురగ కోసం ) నీళ్లల్లో కలిపి పెద్దమొత్తంలో వందలాది లీటర్లను అక్రమంగా తయారు చేస్తున్నారు . ఇలాంటి కల్లును సీసాకు రూ.20-30 వరకు పలుచోట్ల అమ్ముతున్నారు . వీటిని తాగడానికి అలవాటు పడిన వారు మళ్లీ ఇదే కల్లు కావాలని అడుగుతున్నారు . పలు పల్లెల్లోనూ వీటిని విక్రయిస్తున్న దాఖలాలుంటున్నాయి . రసాయన పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రహస్యంగా తీసుకొచ్చి మోతాదుకు మించి వాడటం వల్ల వాటిని తాగిన వారి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని , అది తాగని రోజున పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారని వైద్యులు చెబుతున్నారు .

  గతంలో ఇలా కొన్నిచోట్ల వీటికి అలవాటు పడిన వారు ఈ కృత్రిమ కల్లు దొరక్కపోవడంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించి ఆస్పత్రులకు చేరిన సంఘటనలు జిల్లాల్లో ఉన్నాయి . కొన్ని సందర్భాల్లో యూరియాను కలుపుతున్నారు . యూరియాను కలిపిన కల్లును తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ , కడుపులో మంట , కిడ్నీలు దెబ్బతినే సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు .

  First published:

  Tags: Karimnagar, Telangana

  ఉత్తమ కథలు