Home /News /telangana /

ADMINISTRATIVE SANCTION TO WARANGAL SUPER SPECIALITY HOSPITAL BY TS GOVT VRY

Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ

wgl hospital

wgl hospital

Warangal : వరంగల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయలను విడుదలకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇంకా చదవండి ...
    వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీ ఓ జారీ చేసింది. ( Administrative sanction to warangal super speciality hospital )ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్. ఎ. ఎం. రిజ్వీ, జీ ఓ 158 ని జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కి 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం 105 కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం 229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. కాగా ఈ పనులను వెంటనే Tsmsidc, dme ఆధ్వర్యంలో చేపట్టాలని అదేశించారు.

    కొద్ది రోజుల క్రితమే, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో సీఎం కెసిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో జైలును యుద్దప్రాతిపదికన ఖాలీ చేయించారు. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను ఇతర ప్రాంతాల్లో ఉన్న సబ్ జైలుకు తరలించారు. (warangal super speciality hospital )మరికొంతమందిన హైదరాబాద్‌ చంచల్ గూడకు తరలించారు. కాగా ప్రస్తుతం ఉన్న గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిగా మార్చనున్నారు. జైలు ఖాలీ అయిన తర్వాత ఇటివల సీఎం కేసీఆర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో త్వరితగతిన ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.


    Peddapally : పంచాయితీలోనే భార్యను.. బండతో కొట్టి ప్రాణాలు తీసిన భర్త


    ఈ క్రమంలోనే నేడు ఆసుపత్రికి నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు అందుకోసం 11 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో జారీ చేశారు.(warangal super speciality hospital ) కాగా జీవో ఇవ్వడంపై జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ( Errabelli Dayakar rao ) సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిధులు కూడా మంజూరు చేయడమే పట్ల సీఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎంకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. (warangal super speciality hospital )దీంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడం వల్ల పనులు మరింత వేగం కాగలవని ఆశిస్తూ, మంత్రి హరీష్ రావు గారి కి కృతజ్ఞతలు తెలిపారు.


    child rape and murder : సింగరేణి కాలనీ తరహాలో మరో సంఘటన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి శవం


    ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి అయితే, హైదరాబాద్ స్థాయి వైద్యం, స్థానిక ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. (warangal super speciality hospital )హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుందని చెప్పారు. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసిఆర్ ది అని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hospitals, Warangal

    తదుపరి వార్తలు