(Katta Lenin, News 18, Adilabad)
తమ గ్రామంలో కనీస సౌకర్యాలైన తాగునీరు (Drinking water), కరెంటు (Power), రోడ్డు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) పెంబి మండలంలోని చాకిరేవు (Chakirevu) గ్రామానికి చెందిన ఆదివాసీ (Adivasi people) గిరిజనులు ఆందోళన బాటపట్టారు. గ్రామానికి చెందిన గిరిజనులు (Tribals) పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పాదయాత్ర చేపట్టారు. మూడు రోజులపాటు మండుటెండలో కాలినడకన 75 కిలో మీట్లర్ల దూరం వరకు పాదయాత్ర కొనసాగించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి (Collector office) చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే వంటా వార్పు చేపట్టడంతోపాటు సంప్రదాయ నృత్యాలు చేసి తమ నిరసన (Protest) వ్యక్తం చేశారు.
మురికి నీటినే వాడుతూ..
ఆదివాసీ నాయకులు (Tribal leaders) మాట్లాడుతూ.. గత సంవత్సరం ఇదే వేసవిలో ఖాళీ బిందెలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టామని తెలిపారు. కలెక్టర్ హామీ మేరకు వెనుదిరిగి వెళ్లిపోయామని పేర్కొన్నారు. సంవత్సరం గడిచినా తమ గ్రామంలో మంచినీటి (water) సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న వాగు లోని మురికి నీటినే వాడుతూ కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు గ్రామంలో కరెంటు, రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల (Adivasi people) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు.
గూడెం వాసులు నడిచి రావడం బాధాకరం..
చాకిరేవు గ్రామ ఆదివాసి గిరిజనుల (Adivasi people) ఆందోళనపై రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Sathyavathi rathod)స్పందించారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గూడేనికి తక్షణమే నీటి వసతితోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటిడీఏ ప్రాజెక్ట్ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గారి నాయకత్వంలో తండాలు పంచాయతీలుగా మారి అన్ని వసతులు సమకూరుతున్న తరుణంలో ఇంకా మంచి నీటి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం (Nirmal collector Office) చేరుకోవడానికి 75 కిలోమీటర్లు గూడెం వాసులు నడిచి రావడం బాధాకరమన్నారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆ గూడెం సందర్శించి, తాగునీరు, విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
6 నెలల్లో కల్పిస్తామని..
మంత్రి ఆదేశంతో వెంటనే నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలి ఫారూఖి చకిరేవు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. 60 మంది జనాభా కలిగిన 15 కుటుంబాలు చాకిరేవు గ్రామంలో నివసిస్తున్నామని, తమకు విద్యుత్ సౌకర్యం, మంచినీరు, రోడ్ల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. 6 నెలల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, బోర్వెల్ ను కూడా అటవీశాఖ పరిమితులను అనుసరించి వేయిస్తామని హామీ ఇచ్చారు. మొదట కలెక్టర్ గ్రామస్థులతో వేరేచోట నివాస స్థలం ఇచ్చి వసతులు కల్పిస్తామని చెప్పినప్పటికీ గ్రామస్థులు అక్కడి నుంచి వేరే చోటుకు రామని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
చాకిరేవు గ్రామం పెంబి మండల కేంద్రానికి 22 కిలో మీటర్ల దూరం కవ్వాల్ అభయారణ్యంలో ఉన్నందున కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిబంధనలు అడ్డు వస్తాయని, వేరే ప్రాంతంలో పునరావాసం కల్పించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వారికి కలెక్టర్ నచ్చజెప్పారు. అయినప్పటికీ చాకిరేవు గ్రామస్థులు ఒప్పుకోకపోవడంతో విద్యుత్ సౌకర్యం తోపాటు సోలార్ తో బోర్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో గుమ్మేనా, వెంగ్వా పల్లి గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కోరగా కలెక్టర్ పరిశీలిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఎస్ ఇ ఎలక్ట్రికల్ చౌహాన్, ఎస్ సి మిషన్ భగీరథ, డీఎఫ్వో కోటేశ్వర్రావు, ఈఈ రామారావు, అటవీ, పోలీస్ అధికారులు, సిబ్బంది, సర్పంచులు శింబు, పూర్ణ చందర్ ఎమ్ ఆర్ ఓ, ఎమ్ పి డి ఓ తదితరులు ఉన్నారు.
బైట్ :
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Nirmal, Tribal huts