Home /News /telangana /

ADIVASI DEMANDS FOR ADIVASI BANDHU LIKE DALITA BANDHU AT ADILABAD DISTRICT VRY

Dalita Bandhu : రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? ఆదివాసి బంధు కోసం వేలాదిగా ఆందోళన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dalita Bandhu : ఆదివాసిలకు దళిత బంధు.. వేలాదిగా రొడ్డెక్కిన ఆదివాసిలు... రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు భవిష్యత్‌లో ఆ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టనుందా..ఒకే వర్గానికి డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ భవిష్యత్‌లో అన్ని వర్గాలను ఎలా ఎదుర్కొంటారు...?

ఇంకా చదవండి ...
    హుజూరాబాద్ ఎన్నికలు అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది..ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంతో మిగతా వర్గాల్లో ఆందోళన మొదలైంది..అర్హులైన దళితులకు ఆ పథకాన్ని స్వాగతీస్తూనే..మిగతా వర్గాలు తమకు కూడ కావాలని డిమాండ్ చేస్తున్నాయి..ఇందు కోసం కొన్ని వర్గాలు ఆందోళన బాట కూడా పట్టాయి..రోడ్డుపై ధర్నాలు చేస్తూ...ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్నాయి.మరోవైపు అన్ని ప్రతిపక్ష రాజకీయ పక్షాలు సైతం అన్ని వర్గాలకు బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి..ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి సారి పెద్ద ఎత్తున దళిత బంధును గిరిజన,ఆదివాసిలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఇంద్రవెళ్లిలో ప్రారంభించారు. దీంతో అక్కడి ఆదివాసి గిరిజనులు ఆందోళన బాట పట్టారు.

    ఆదిలాబాద్‌లోని కుమ్రంభీం చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు..దళితుల వలే మాకు కూడా ఆదివాసి బంధును ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఆ ప్రాంతానికి చెందిన అనేక మంది ఆదివాసిలు తమ నుండి అప్లికేషన్స్ తీసుకోవాలని స్థానిక జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. అయితే ఇందుకోసం కలెక్టర్ ముందుకు రాకపోవడంతో ఏక కలెక్టరేట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు..దీంతో దీంతో దిగివచ్చిన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్‌ను రంగంలోకి దింపింది..దీంతో ఆయనకు మొత్తం అయిదు వేల మంది తమ అప్లికేషన్లు ఇచ్చారు.. దీంతో పాటు తమ డిమాండ్స్‌కు సమర్పించారు..పోడు భూముల హక్కుతో పాటు ఆదివాసి యూనివర్శిటిని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయడంతోపాటు దళిత వలే వారికి కూడా మూడు ఎకరాల భూమిని కూడా ఇవ్వాలని డిమాండ్‌లో పేర్కొన్నారు.

    మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి వ్యతిరేకంగా చేపట్టిన దళిత గిరిజన దండోరా ఫలితాలు ఆ పార్టీకి కలిసివస్తున్నట్టుగా కనిపిస్తోంది..రాష్ట్రంలో మెజారిటి ప్రజలు కూడా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడం వారికి కూడా ఇలాంటీ పథకాలను ఇవ్వాలనే డిమాండ్స్ వస్తున్నాయి..దీన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేయడంతో అనుకున్నట్టు ఫలితాలు వస్తున్నాయా అనే చర్చ కొనసాగుతోంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Dalitha Bandhu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు