నిద్రలేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది మద్యం బెల్ట్ షాపు..

బెల్ట్ షాపు దగ్గర ధర్నా చేస్తున్న మహిళలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నారీలోకం మద్యం బెల్ట్ షాపులపై సమరభేరి మ్రోగించారు.

  • Share this:
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నారీలోకం మద్యం బెల్ట్ షాపులపై సమరభేరి మ్రోగించారు. కట్టలుతెంచుకున్న ఆగ్రహంతో దుకాణాల ఎదుట ఆందోళనకు దిగారు. ఖాళీ సీసాలను పగులగొట్టారు. ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదివేనగర్ కాలనిలో మద్యం బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగారు. కాలనీలోని దుకాణాల ఎదుట ఆందోళన చేపట్టి ఖాళీ సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. దుకాణాలను మూసివేయాలని యజమానులను హెచ్చరించారు. మహిళల ఆందోళనకు కాలనీ యువకులు కూడా బాసటగా నిలిచారు. ఒకే కాలనిలో 20కి పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణ యజమానులు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ అడ్డగోలుగా విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు. బెల్టుషాపుల వల్ల కుటుంబాలలో తరచుగా గొడవలు జరుగుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుండి కాలనిలో షాపులు తొలగించకపోతే మహిళలంతా సంఘటితమై ఆందోళన చేస్తామని షాప్ యజమానులను హెచ్చరించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: