Home /News /telangana /

ADILABAD WAS FLOODED DUE TO HEAVY RAINS AND THE OFFICIALS ARE LIFTING THE GATES OF THE RESERVOIRS ADB PRV

Rains in Telangana: Alert.. ఆదిలాబాద్​లో పోటెత్తిన వరదలు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తున్న అధికారులు.. 

ఆదిలాబాద్​లో జలాశయం

ఆదిలాబాద్​లో జలాశయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరదలు పోటెత్తాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వరదలు పోటెత్తాయి. జిల్లాలోని జలాశయాలు (Reservoirs) నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కోతకుగురై, చెట్లు విరిగి రోడ్డిపై పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.  భారీ వర్షాలకు నిర్మల్  (Nirmal) జిల్లాలో నదులకు వరద పోటెత్తుతుంది.  నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎస్సారెస్పీ (SRSP), కడెం, గడ్డెన్న స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు  ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు నిర్మల్ (Nirmal) జిల్లాకు చెందిన రాష్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్ళోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ.. సమీక్షలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

    స్వర్ణ ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్ట్ ను సందర్శించి.. ఇన్ ప్లో, అవుట్ ప్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ఎస్సారెస్పీ లోకి 81 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో,  లక్ష  క్యూసెక్కుల అవుట్ ప్లో,  కడెం ప్రాజెక్ట్ లోకి  2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో,  2 లక్షల  క్యూసెక్కుల అవుట్ ప్లో, స్వర్ణ ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో,  27 వేల  క్యూసెక్కుల అవుట్ ప్లో,  గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో,  20,300  క్యూసెక్కుల అవుట్ ప్లో వరద నీటితో నదులు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు.  వర్షాల వల్ల చెరువులు ఇప్పటికే  70 శాతానికి పైగా నిండాయన్నారు. ఎస్సారెస్పీతో పాటు కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాజెక్ట్ ల  పరివాహక ప్రాంత పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    పెన్​గంగా నది కూడ ఉధృతం..

    మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. ఇదిలా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలు కూడా నిండుకుండలా మారాయి.  జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్ట్ వరద నీటితో నిండు కుండను తలపిస్తుంది. ఇన్ ప్లో 7800 క్యూసెక్ ల వరదనీరు ప్రాజెక్ట్ లోకి రాగ రెండు గేట్ల సహాయంతో 7800 క్యూసెక్ వరద నీటిని దిగువకు వదిలారు.  ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 284.30 మీటర్ల నీరు ఉంది. అటు పెన్​గంగా నది కూడ ఉదృతంగా ప్రవహిస్తోంది.. పంటపొలాలు నీట మునిగాయి. ఈ వర్షం ఇలానే కొనసాగితే మాత్రం రైతులు వేసిన పంటలు నష్టపోయే పరిస్థితులు తలెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 277.50 మీటర్లు సామర్థ్యం 0.571 t. m. c కాగా ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 4 వేల 3 వందల క్యూసెక్కుల ఇన్​ఫ్లో  ఉండగా వచ్చిన నీరును వచ్చినట్టుగా 3 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నమని ప్రాజెక్ట్ జెఇ హరీష్ తెలిపారు. అటు మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు గోదావరి నిండుకుండలా మారాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం అడ ప్రాజెక్టులోకి కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సంబంధింత అధికారులు ఆయా ప్రాజెక్టుల నీటి సామార్ధ్యాలను పరిశీలీస్తూ వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు