Home /News /telangana /

ADILABAD TRS LEADERS ARE WAITING FOR CABINET EXPANTION ADB VRY

Adilabad : నేతల శ్రమకు ఫలితం దక్కేనా...? మంత్రి ప్రమోషన్ కోసం నేతల ఎదురు చూపులు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టిఆర్ ఎస్ మరోసారి తన పట్టును నిలుపుకోవడంతో... ఈ సారి విస్తరించే మంత్రి వర్గంలో జిల్లా నుండి మరొక్కరికి అవకాశం దక్కేనా అన్న ఆశలు చిగురిస్తున్నాయి.

  (కట్ట లెనిన్, న్యూస్ 18, ఆదిలాబాద్)

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరోసారి తన పట్టును నిలుపుకున్నది. ఇటీవల అనూహ్య పరిణామాల మధ్య అనివార్యమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి విజయం పొందటంతో ఆ పార్టీకి పట్టు మరోసారి నిరూపితమైంది.

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిమంది శాసన సభ్యులు, నలుగురు జిల్లా పరిషత్ చెర్మెన్ లు, మెజార్టీ మున్సిపల్ చైర్మెలు, ఎంపిపిలు అధికార పార్టీకి చెందిన వారే. అయితే ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల సందర్భంగా పార్టీలో అసంతృప్తి పొడచూపినప్పటికి అప్రమత్తమైన ఆ పార్టీ నేతలు భుజ్జగింపులతో ఆదిలోనే అసంతృప్త జ్వాలలను చల్లార్చ గలిగారు. అయితే శాసనమండలి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆ పార్టీ నేతలు వ్యూహం చివరి క్షణంలో బెడిసికొట్టడంతో ఎన్నిక అనివార్యమైంది.

  ఒక్క స్థానానికి 24 నామినేషన్లు దాఖలు కావడంతో రంగంలోకి దిగిన మంత్రి, శాసన సభ్యులు 22 మందితో నామినేషన్లు ఉపసంహరించుకునేల చేయగలిగారు. కాని తుడుం దెబ్బ మద్దతుతో తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో దిగిన మహిళ నేత నామినేషన్ ఉప సంహరనకు ససేమిరా అనడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే స్థానిక సంస్థల్లో మెజార్టీ సభ్యులు అధికార టిఆర్ ఎస్ పార్టీ వారే ఉన్నప్పటికి ఒకింత భయం ఆ పార్టీ నేతలను వెంటాడింది. ఎక్కడ క్రాస్ ఓటింగ్ తమ అభ్యర్థిని డికొడుతుందోనన్నఆందోళనను రేకెత్తించింది. అయితే జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తోపాటు అధిష్టానం ఆదేశంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ జిల్లాలో ఇతర శాసన సభ్యులు, ఇతర ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ పార్టీ అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఫలితంగా ఎమ్మెల్సీ స్థానం ఆ పార్టీ ఖాతాలో చేరింది. దీంతో జిల్లాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది.

  Breaking : మరో ఐదు కార్పోరేషన్లకు చైర్మన్లు.. నియమించిన సీఎం కేసీఆర్..వాళ్లు ఎవరంటే..


  ఇదిలా ఉంటే శాసన మండలి ఎన్నికల అనంతరం మంత్రి మండలి చేర్పులు మార్పులు జరుగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్త మంత్రివర్గంలో బెర్తు దొరుకుతుందేమోనన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధినేత, యువరాజు కు విశ్వాస పాత్రుడిగా ఉన్న ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ కు ఈసారి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు.

  Bhadradi Kothagudem : గురుకులంలో దారుణం.. ఇద్దరు ఏకంతంగా ఉండగా మరో టీచర్..వీడియో తీశాడు..చివరకు


  మరోవైపు ఈసారి మంత్రి వర్గంలో కొత్తవారికి అధినేత అవకాశం కల్పిస్తారన్న వాదనలు ఉన్నాయి. అలా జరిగితే అనూహ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థిగా తెరపైకి వచ్చి గెలుపొందిన దండె విఠల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి మంత్రివర్గంలో అవకాశం దక్కించుకుని, మలివిడతలో అవకాశం దక్కని ఆదిలాబాద్ శాసన సభ్యుడు జోగు రామన్న కూడా మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అధికార టిఆర్ ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అసలు మరొక్కరికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా, ఒకవేళ ఆ ఆవకాశం వస్తే మంత్రి పదని ఎవరిని వరిస్తుంది అన్న ప్రశ్నలు ప్రస్తుతం అందరిని తొలిచివేస్తున్నాయి. వీటికి సమాధానం లభించాలంటే ఇంకా కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు