హోమ్ /వార్తలు /తెలంగాణ /

సైకిల్ నడిపిస్తూ ప్రజల్లో జోష్ నింపిన కలెక్టర్.. ఎక్కడంటే..?

సైకిల్ నడిపిస్తూ ప్రజల్లో జోష్ నింపిన కలెక్టర్.. ఎక్కడంటే..?

కలెక్టర్ రాహుల్ రాజ్..

కలెక్టర్ రాహుల్ రాజ్..

Telangana: తను జిల్లాకు ఒక ఉన్నతాధికారి. ఎక్కడికి వెళ్ళాలన్నా అధికారిక వాహనం ఉంటుంది. వెంట బంట్రోతు, గన్ మెన్ కూడా ఉంటారు. ఏ పని అయినా ఉన్న చోటి నుండి ఆదేశిస్తే చాలూ చేసి పెట్టే సిబ్బంది ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తను జిల్లాకు ఒక ఉన్నతాధికారి. ఎక్కడికి వెళ్ళాలన్నా అధికారిక వాహనం ఉంటుంది. వెంట బంట్రోతు, గన్ మెన్ కూడా ఉంటారు. ఏ పని అయినా ఉన్న చోటి నుండి ఆదేశిస్తే చాలూ చేసి పెట్టే సిబ్బంది ఉంటారు. కానీ వాటన్నింటి కొంత సేపు పక్కన పెట్టి సాధాసీదాగా సైకిల్ ఎక్కి సవారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా ఉత్సాహంగా రోడ్డుపై సైకిల్ తొక్కడంతో చూసిన వారు అవాక్కయ్యారు. అసలు విషయం తెలుసుకొని కుదుటపడ్డారు. అసలు విషయం ఏమిటంటే… అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. అయితే సైకిల్ ర్యాలీ ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా సైకిల్ నడిపి ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఎవరి సహకారం లేకుండానే స్వయంగా కలెక్టర్ తనకు తానే సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు.

మిగతా వారు కలెక్టర్ ను అనుసరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, అందుకే హెల్దీ వుమెన్, హెల్దీ తెలంగాణ అనే నినాదంతో ప్రభుత్వం మహిళల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టిందని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి మహిళ ఆరోగ్య క్లినిక్ లను ప్రారంభిస్తోందని అన్నారు.

ఇందులో భాగంగానే ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో రెండు ఆస్పత్రుల్లో మొత్తం మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి చికిత్సలు అందజేసే విధంగా చూస్తామన్నారు. ప్రతి మంగళవారం అన్ని ఆసుపత్రుల్లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ తో పాటుగా ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్ బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే అయింది. గతంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రాహుల్ రాజ్ ను ప్రభుత్వం ఆదిలాబాద్ కలెక్టర్ గా నియమించింది. ఇక్కడ కలెక్టర్ గా విధులను నిర్వహించిన సిక్తా పట్నాయక్ ను హన్మకొండ జిల్లాకు బదిలీ చేసింది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ రాజ్ పాలనలో తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నారు.

పారిశుద్ధ్యానికి ప్రాధ్యాన్యమిస్తూ పల్లె, పట్టణంలో కలియ తిరుగుతూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. దీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆకస్మిక పర్యటనలతో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి సంస్కరణలు చేపడతారోనని జిల్లా ప్రజలు  చెప్పుకుంటున్నారు.

First published:

Tags: Adilabad, Local News, Telangana, VIRAL NEWS

ఉత్తమ కథలు