Adilabad : కాఠీన్యం ప్లస్ కనికరం = పోలీస్.. లాక్ డౌన్‌లో ఉదారతను చాటుకుంటున్న పోలీసులు

కాఠీన్యం ప్లస్ కనికరం = పోలీస్.. లాక్ డౌన్‌లో ఉదారతను చాటుకుంటున్న పోలీసులు

Adilabad : పోలీసులు అంటేనే అందరు భయపడి ఆమడ దూరం పారిపోతారు. వారు అసలే కఠినంగా ఉంటారని అంతా భయపడతారు. కాని వారిలోనూ కనికరం, దయ, జాలి కలిగిన వారు ఉంటారని రుజువుచేస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు.

  • Share this:
కరోనా వ్యాప్తిని అరికట్టెందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పకడ్భందీగా అమలుచేస్తున్నారు. జిల్లాలో లాక్ డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు అదే సమయంలో నిస్సాహయులపట్ల కనికరం కూడా చూపుతున్నారు. లాక్ డౌన్ తో మధ్యలో చిక్కుకుపోయి ఎటుపాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వృద్దులు, మహిళలను వారి వారి గమ్యాలకు చేరుకునేందుకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నారు.

ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలోని ఆసుపత్రిలో తమ కూతురిని చూయించేందుకు దండేపల్లి గ్రామానికి చెందిన గుడికందుల సతీష్ భాగ్యలక్ష్మీ దంపతులు కూతురి తీసుకొని వచ్చారు. అయితే తిరుగు ప్రయాణంలో వారికి వాహనాలు దొరకక అక్కడే నిరీక్షిస్తూ ఉండిపోయారు. లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తు అక్కడికి చేరుకున్న మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి వారిని గమనించారు. వారి దగ్గరుకు వెళ్ళి వారు ఎక్కడికి వెళ్ళాలో వాకబు చేసి, కూతురి చికిత్స కోసం లక్షేట్టపేట్ కు వచ్చి తిరుగు ప్రయాణంలో వాహనాలు దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నారు.

దీంతో పోలీసు వాహనంలోనే వారిని వారి గ్రామానికి పంపించి తన ఉదారతను చాటుకున్నారు. అలాగే లక్షేట్టిపేట్ మండలం ఎల్లారం గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ద దంపతులు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకొని తిరుగు ప్రయాణంలో దారి ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండగా వారిని గమనించిన స్థానిక ఎస్.ఐ చంద్రశేఖర్ వారిని ఆటోలో ఎక్కించి వారి ఊరికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉదయం నిత్యావసరాల కోసం బజారుకు వచ్చిన వృద్దురాలు లాక్ డౌన్ కారణంగా ఆటోలు లభించక ఇంటికి వెళ్ళేందుకు నానా అవస్థలు పడ్డది. చివరకు ఆటోలు దొరకక మండుతున్న ఎండలోనే నడుచుకుంటూ వెళ్తుండటంతో, ఆ వృద్దురాలిని అక్కడే లాక్ డౌన్ లో భాగంగా అక్కడే వాహనాలు తనిఖీ చేస్తున్న బెల్లంపల్లి ఎసిపి రెహెమాన్ గమనించారు. ఆ వృద్ద మహిళను చూసి జాలిపడిన ఎసిపి వెంటనే దగ్గరుండి ఓ ఆటోను పిలిపించి అందులో ఆ మహిళను ఎక్కించి ఇంటికి పంపించారు.

అలాగే చెన్నూరు మండలం మల్లంపేట గ్రామానికి చెందిన వ్యక్తి వైద్య పరీక్షల కోసం చెన్నూరుకు వచ్చి, తిరుగు ప్రయాణంలో ఊరికి వెళ్ళేందుకు వాహనాలు లేక చెరువు కట్ట వద్దే కూర్చిండిపోయిన ఆ వ్యక్తి గమనించిన పెట్రోలింగ్ పార్టీ కానిస్టెబుల్ శంకర్, హోంగార్డు రాము ఓ ఆటో మాట్లాడి అందులో సదరు వ్యక్తిని పంపించారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాక్ డౌన్ సందర్భంగా విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తూనే మరోవైపు మానవతా దృక్పథంతో పలువురికి సహాయం చేస్తుండడం చూసిన వారందరు పోలీలను అభినందిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: