(K.Lenin,News18,Adilabad)
ముంచుకొచ్చిన కరోనా(Corona)ఉపద్రవంతో ప్రతిఒక్కరు ముఖానికి మాస్క్ ధరించడం తప్పని సరి అయిపోయింది. కొద్ది కాలం మాస్కు లేనిదే కాలు కూడా బయటపెట్టడానికి వీలు లేకుండా పోయింది. వాణిజ్య సంస్థలు, మాల్లు, ఇతరత్ర కార్యాలయాలు, సంస్థల్లో మాస్కు లేనిదే ప్రవేశం లేదని బోర్డులు కూడా వెలిశాయి. క్రమంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ముఖానికి మాస్కు( Mask)ను ధరించడం మానివేశారు. ఇటీవల కాలంలో అక్కడక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో మళ్లీ మాస్కులు ధరిస్తున్నారు. మాస్కు ను ఎలా ఉపయోగించాలో, దాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో అందరికి తెలిసిందే. అయితే ఓ మంచిర్యాల(Mancherial)జిల్లాకు చెందిన ఓ యువకుడు మాస్కును ఇంకోరకంగా ఉపయోగించి అడ్డంగా బుక్కయ్యాడు.
బైక్ నెంబర్ ప్లేట్‌ని మాస్క్‌తో కవరింగ్..
కరోనా నుంచి వ్యక్తిగత రక్షణ పొందడం కోసం ప్రభుత్వం మాస్కు వాడటం తప్పని సరి చేసింది. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో మాస్కులను వాడే వారు తక్కువ అయ్యారు. అయితే కొందరు మాత్రం ఇవే మాస్కులను వేరే రకంగా ఉపయోగిస్తున్నారు. మంచిర్యాల పట్టణ పోలీసులు గత కొద్దీ రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడుపుతున్న వాహన యజమానులకు ఇ. చాలన్ ద్వారా జరిమానా కూడా విధిస్తున్నారు. అయినా కొందరు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ, వాహనాల నెంబర్ ప్లేట్‌లను ఏర్పాటు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. ఇంకా కొందరు ఏకంగా నెంబర్ ప్లేట్లకు మాస్క్ వేస్తున్నారు. శుక్రవారం వాహన తనిఖీల్లో పట్టుబడిన ఓ వాహనదారుడు తన వాహనం నెంబర్ ఫీడ్ కనబడకుండా మాస్క్ ని ఏర్పాటు చేశాడు. అతడ్ని పట్టుకున్న పోలీసులు జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లుగా మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ తెలిపారు.
ఛీటింగ్ కేసు బుక్ చేశారుగా..
నిబంధనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్పు చేసిన నంబర్‌లపై స్టిక్కర్లుగాని నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్‌ను వంచిన వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని తెలిపారు. ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించినా కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపితే అలాంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని మంచిర్యాల పట్టణ ఇన్ స్పెక్టర్ నారాయణ వెల్లడించారు.
ఇకపై వదిలే ప్రసక్తి లేదంతే..
మరికొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇకపై ఇలాంటివి చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని మంచిర్యాల పట్టణ పోలీసులు స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, Telangana crime news