Go corona : గో కరోనా..గో.. పోచమ్మ తల్లైనా కరుణిస్తుందా....

గో కరోనా..గో.. పోచమ్మ తల్లైనా కరుణిస్తుందా....

Adilabad : ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా కుటుంబాలనే మింగేస్తున్న కరోనా ఎంత విపత్తును సృష్టిస్తుందో తెలిసిందే..అయితే ఈ మహమ్మారిని పారద్రోలేందుకు ఓ వైపు వైద్య నిపుణులు శ్రమిస్తున్నా..దాన్ని కట్టడి చేయడం మాత్రం కష్టంగా మారింది.. కాని ఈ మహమ్మారి పై గ్రామీణులకు మరో అభిప్రాయం ఉంటుంది. కరోనా వెనుక ఏదో అదృష్ట శక్తి ఉందని భావిస్తున్న గ్రామీణ ప్రజలు గ్రామ దేవతలు, కుల దైవాల మీద పడ్డారు. దీంతో కరోనా మహమ్మారి వెళ్లిపోవాలంటూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

  • Share this:
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలను పాటిస్తున్నారు. ఆరోగ్య, ఇతర సమస్యలు వచ్చినప్పుడు వాటి భారీ నుండి కాపాడాలని గ్రామ దేవతలకు పూజలు, అభిషేకాలు చేయడం, బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని వేడుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు పల్లెల్లో ప్రజలు గ్రామ దేవతలకు పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. కోళ్లు, మేకలను బలి కూడా ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామాని చెందిన ఎస్సీ కాలనీ మహిళలు గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి సామూహికంగా బోనాలను సమర్పించారు. ఒక చేత వేప మండలు, మరో చేత బోనం కుండలు పట్టుకొని డప్పు చప్పుళ్లతో ఊరెగింపుగా ఆలయాని తరలివెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బజార్ హత్నూరు, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రవెల్లి మండలం మన్నూరు గ్రామ పటేల్ హచ్ కె జంగు ఆధ్వర్యంలో మహిళలు పోచమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. గ్రామం నుండి మహిళలు బిందెల్లో నీళ్లు తీసుకొని వరుసగా కాలినడకన ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఉట్నూరులోనైతే భక్తులు పోచమ్మ తల్లికి ఐదు రోజులపాటు జలాభిషేకం చేశారు. అటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం, బెజ్జూరు, పెంచికల్ పేట తదితర మండలాల్లో, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. కరోనాను కట్టడి చేయాలని అమ్మవారిని వేడుకున్నారు.
Published by:yveerash yveerash
First published: